Others

గడ్డిపరకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విధి నన్ను చూసి వెక్కిరిస్తోంది
నీకై నే నిర్మించుకున్న ఊహాసౌధాన్ని
పునాదుల్లేకుంటా కూల్చేశాననీ

గడ్డిపరకలు సైతం
గలగలమంటూ నవ్వేస్తున్నాయ్
కడసారి కదలివెళ్లిన నీ అడుగుల
గుర్తుల్ని చీల్చేస్తూ మొలకెత్తామనీ...

కాలం విర్రవీగుతోంది
నీకు నాకు మధ్య దూరాన్ని
ఒక జీవిత కాలం పెంచేశాననీ...

పాపం వాటికేం తెలుసు
నా ఊహల్లో నువ్వున్నావనీ
నా ఊపిరిలో దాగున్నావనీ

పాపం వాటికేం తెలుసు?
నా గుండె గుడిలో నిత్యం
ప్రమిదవై ప్రకాశిస్తున్నావనీ...

- కోడిగూటి తిరుపతి, 9573929493