Others

చెప్పుల్లేకుండ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది తప్పేం కాదు
అప్పుడప్పుడు
చెప్పుల్లేకుండ నడవడం..

ఏ గతుకుల్లేని
గంభీరమైన
సిమెంటు రోడ్డుమీదే కాదు
గులకరాళ్ళు, గుండ్రాళ్ళు, సూదిరాళ్ళు
చుప్పనాతి ఎదుర్రాళ్ళ మీదుగా
కరుకు గరుకు రాళ్ళ మీదుగా చూసుకుంటూ
సున్నితంగా సుతారంగా ప్రయాణించు..

సుదూర చీకటి రంగు రహదారులు కంటే
పొగ కమ్మిన పరిసరాలు కంటే
కాలిబాటలు, డొంకదారులు
దువ్వదారులు, పైరగాలి
ఎంతో ప్రేమగా ఉంటాయ

పచ్చని శ్రేయోభిలాషుల మధ్య
పిట్టల పలకరింపుల మధ్య
అలా కాలు సాగడం
చెప్పుల్లేని నడకలో చెమటబట్టడం
జీవితానికి ఆరోగ్యం కదా!

చెప్పుల్లేకుండ నడుస్తున్నప్పుడు
భూమి గుండె
హృదయంలో ప్రతిధ్వనిస్తున్న సవ్వడి!

తలనుంచి పాదాల వద్దకి దిగుతున్న
రక్తకణాల్తో
ధాత్రిలోని ప్రాణధాతువు
సంగమిస్తున్న జీవక్రియ!

చెప్పుల్లేకుండ నడవడం
నామోషేం కాదు
కాలికీ నేలకీ మధ్య
కాసేపు ఉన్న అవాస్తవాన్ని తీసివేయడమే

రక్షల్లేకుండ ప్రయాణించడం
గర్వభంగమేమీ కాదు
మనిషికీ మట్టికీ మధ్య
కాసేపు ఉండాల్సిన సత్సంబంధాన్ని
పునః ప్రతిష్టించుకోవడమే!

- రవి నన్నపనేని, 7993981211