Others

ఈ వీణకు.. (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాకు నచ్చిన, నా ఎద వీణను శృతి చేసిన పాట
-ఈ వీణకు శృతి లేదు/ ఎందరికో హృదయం లేదు/ నా పాటకు పల్లవి లేదు/ ఈ బ్రతుకెందులకో అర్థంకాదు
ఈ పాట సన్నివేశానికి భావుకత అద్దినట్టుంటుంది. సమాజంలో జరుగుతున్న చీకటి పనులకు కారణమై.. పెద్ద మనుషులుగా చలామణీ అవుతున్న వారి అంతరంగాలను కలవరపరుస్తూ ఆవిష్కరించిన పాట ఇది. ఈ పాటలో -దుష్ట సమాజాన్ని నిలదీసే శక్తి.. దుష్టత్వాన్ని రూపుమాపాలన్న ఆసక్తి చెప్పకనే చెబుతుంటాయి. నోరు విప్పకనే విప్పుతుంటాయి. అది ఆత్రేయ మార్క్.
పటిష్టమైన పల్లవిని చుట్టుకు తిరుగుతున్న చరణాలను పరిశీలిస్తే
‘అందాన్ని వెలకట్టేవాళ్లకు/ అనురాగం వెలివేసిన వాళ్లకు/ తెగిపోయిన తీగలు మీటే వాళ్లకు/ నేనేమని చెప్పేది... ఏ పాటలు పాడేది’
అబలయైన ఆడది ఇంతకన్నా ఏమి వ్యక్తపరచగలదు అశక్తతని. ఇంతకన్నా ఏం ఎత్తిచూపగలదు పెద్దమనుషుల ముసుగులోవున్న అసభ్య సమాజాన్ని.
మనసు గొంతు నులిమేసి మూగ రోదనలో... వౌన భావనతో వేసారిన భారతీయ మహిళామణుల రోదనను వేదనను ఇంత చక్కగా సన్నివేశంలో ఇమడ్చటం, దానికి మామ కెవి మహదేవన్ సంగీతం సమకూర్చటం, కోయిల పి సుశీలమ్మ గానం.. దర్శకస్రష్ట సిఎస్ రావు ‘దేశోద్ధారకులు’ చిత్రంలో తెరమీద ఆవిష్కరించడం వెనుక నిర్మాత యు విశే్వశ్వరరావు అభిరుచి ఎంతో కనపడుతోంది.
ఇంతగా కుళ్లిపోయిన, దిగజారిపోయిన, అబలలను దిగజార్చుతున్న ధోరణులకు ఇంతకన్నా ఎవరు చెప్పగలరు. వినే చెవులకు మనసుంటే ఇనిపిస్తుందా ఇది అన్న ఆత్రేయ పదాలకు ఎంతో పదునుంది- నిజంగా మనసుండి సరిచేసుకుంటే సమాజానికి బంగరు భవిష్యత్ ఉంటుంది.
అందుకే ఈ పాట నాకెంతో నచ్చిన పాటైంది.