Others

అర్థం లేకపోతే వ్యర్థమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు
7-8-51,్ఫ్లట్ నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079
============================
వేగముగా ఎవరో తరుముచున్నట్లు అస్పష్టముగా ఉచ్చరించినచో ఫలితముండదు, ధ్యానము కుదరదు. అట్లే మంత్రముపై శ్రద్ధపెట్టక, యథాలాపముగా, స్వరబద్ధత లేకుండా మనసు మంత్రముపై నిలుపక మంత్ర జపము చేయుటవలన ఏకాగ్రత కలగదు సరిగదా విపరీత పరిణామములేర్పడును.
మంత్రార్థము తెలియకుండ మంత్ర జపముచేసిన ప్రయోజనముండదని చెప్పుచూ శ్రీ భాస్కరరాయల వారిట్లు చమత్కరించిరి.
‘‘నా‚ ర్థజ్ఞాన విహీనం శబ్దోచ్ఛారణం ఫలతిః
భస్మాని వహ్ని విహీనే నప్రక్షిప్తం హవిర్జ్వతిః
అర్థమజానానాం నానావిధ శబ్దమాత్ర పాఠవతామ్
ఉపమేయ శ్చక్రీవాన్, మలయజ భారస్య వోదేవ॥
(పరివస్యా రహస్యము)
అనగా మంత్రముయొక్క అర్థమునెరుగక కేవలము అందలి శబ్దమునుచ్ఛరించువారు, గంధపుచెక్కలను మోసుకుని వెళ్ళే గాడిదతోను, అగ్నిలేని భస్మమునందు సమర్పించిన హవిస్సుతోను సమానమని అర్థము.
మంత్రమందలి శబ్దార్థములు, శివశక్తుల వంటివి. అవి యెప్పుడూ వేరుగా నుండవని ‘‘కామ కలావిలాసము’’ చెప్పుచున్నది.
బీజాక్షర సంపుటీకరణమైన మంత్ర, జప, ధ్యాసములచేత, మనయందు అట్టి మంత్రముయొక్క ప్రజ్ఞ లేక తరంగశక్తి మేల్కొలుపబడుచున్నది. మన శరీరమందలి ఏడు శక్తికేంద్రములు (చక్రములు), 49 సూక్ష్మ కేంద్రములు (ఎనర్జీ సెంటర్స్)కలవు. ఇట్టి శక్తికేంద్రములు ‘‘అ’’ నుండి ‘‘హ’’వరకు గల అక్షరములచేత ప్రబోధము చెందుచున్నవి. ఆ విధముగ ఉత్తేజితములైన కేంద్రములు, వాటి అధీనములోని శరీరావ యవములయందు సత్వప్రధానమైన శక్తిని స్పిరిట్యువల్ ఎనర్జీ పునర్నిర్మాణము చేయును. తత్ఫలితముగా ఆయా అవయవమలు సత్వ ప్రధానమైన శక్తిని పొందును. అందుచేతనే రోగ నివారణకు ఆయా సంబంధమైన మంత్రమును కనీసము 40 (మండలము)రోజులు నిష్టతో, ఏకాగ్రతతో ధ్యానించవలెను.
స్వీయానుభవము
ఈ సందర్భములో నాకు కలిగిన స్వీయానుభవమును సహృదయులు, ఆస్తికులైన పాఠకులకు వివరించుట యుక్తమని భావిస్తున్నాను. నేను 2008 సంవత్సరమునందు కుడి చెవినందు (్ళ్ద్యళఒఆళూఆ్య్ఘౄ) ఒక రకమైన ‘క్యాన్సర్’ వంటి వ్యాధితో విపరీతముగా బాధపడ్డాను. హైదరాబాదునందలి కొన్ని కార్పోరేట్ వైద్యశాలలో ఎన్నో రకముల వైద్యముచేసి, చివరకు శస్తచ్రికిత్స చేసి ఎన్నో రకముల యాంటీబయోటిక్స్ వాడినారు. లక్షల రూపాయలు ఖర్చుచేసినను ఎట్టిప్రయోజనము లేకపోగా వ్యాధి విస్తృతమైనది.
- ఇంకాఉంది

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9849560014