Others

వైచిత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాషణం..
సాగరంపై కదలని అలల్లా
నిశ్చలమైనప్పుడు
సంభాషణం సాఫీగనే సాగుతది

మాటలకు, చేతలకు
కొంచెమైనా పొంతన కుదరనప్పుడే
అసలు కత మొదలైతది

చెప్పేది, చేసేది ఒక్కటి కానప్పుడు
ప్రవచించిన ప్రవచనాలు
క్రియలు, ప్రక్రియలు కాలగమనంలో
మంచులా కరిగిపోతాయ!

సమాజానికి విసిరిన ఆదర్శాలు
నో పార్కింగ్‌లో పార్కింగ్‌లా
ఆచరణలో భిన్నమైనప్పుడే
పాత్రలు అస్థిరత్వానికి లోనైతవి.

దేన్నయతే అమితంగా ద్వేషిస్తామో
దానినే కౌగిలించుకుంటుంటాం
ఏదయతే అదేపనిగా చెబుతామో
దానికే విముఖంగా ప్రవర్తిస్తుంటాం

హేతువుల్ని, సూత్రాల్ని వదిలేసి
ఎక్కడెక్కడికో జారిపోతుంటాం
సూక్ష్మదర్శినితో పరీక్షించినా
కనబడని లోతుల్లోకి పడిపోతుంటాం

చెప్పింది చెప్పినట్టు చేయడం
చేసింది చేసినట్టు చెప్పడం
ఎంత సంక్లిష్ట యుద్ధమో కదా!

సత్య నిరూపిణి ఔషధాన్ని తాగించి
ఎవ్వరి జీవన సరళినైనా
ఓ కంట గట్టిగా కనిపెడితే తప్ప
బతుకులో చిత్ర విచిత్రాలు బోధపడవు

మార్పు తీవ్రతలో ఎన్నటికైనా
మాటమీద నిలబడ్డ...
మనిషి విలువల్ని ఆక్యురసీగా కొలిచే
ఏకైక కొలమానం మాత్రం ఆచరణే!!

- అశోక్ అవారి, 9000576581