Others

ఉదరమే రెండో మెదడు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన శరీరానికి అందే షుగర్, శక్తిలో ఇరవై శాతం మెదడుకు వెళుతుంది. అంటే మెదడు పనితీరు పూర్తిగా గ్లూకోజ్ లెవల్స్ మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల షుగర్ లెవల్స్‌ను సరిగా నియంత్రించకపోతే మెదడు పనితీరు సరిగా ఉండదు. మానవుని జీర్ణవ్యవస్థలో ఒక వంద ట్రిలియన్లకుపైగా సూక్ష్మజీవులు ఉంటాయి. మెదడు బాగా పనిచేయాలంటే ఆ సూక్ష్మజీవులు సమతౌల్యంతో ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. నిజానికి మన పొట్టను మనం రెండో మెదడుగా భావించాలి. అందుకే జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి మనం సరైన ఆహారపదార్థాలను తీసుకోవాలి. వైవిధ్యభరితమైన, ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు ఈ సూక్ష్మజీవులను సమతుల్యతతో ఉంచుతూ, మెదడు బాగా పనిచేయడానికి సహాయపడతాయి. మెదడు కణాలు కొవ్వుతో తయారవుతాయి. అందువల్ల మనం తినే ఆహారపదార్థాలలో తగినంత మంచి కొవ్వు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.
అంతేకాదు మెదడుకు వ్యాయామం కూడా అవసరమే.. వ్యాయామం వల్ల శరీరానికే కాదు మెదడుకు కూడా చాలా మంచిది. వ్యాయామం వల్ల మెదడులో కొత్త శక్తి మొదలవుతుంది. మెదడులో కొత్త సంబంధాలు ఏర్పడతాయి. అలాగే కొత్తకణాలు ఉత్పత్తి అవుతాయి. నిజంగానే.. వ్యాయామం వల్ల శరీరం ఎక్కువ ఆక్సిజన్‌ను గ్రహిస్తుంది. ఇలా మెదడుకు ఆక్సిజన్, గ్లూకోజ్ అందితే శరీరంలో టాక్సీన్ల నిర్మూలన జరుగుతుంది. అందుకని వ్యాయామాన్ని ఆరుబయట చేస్తే మరీ మంచిది. దీనివల్ల మెదడుకు ఆక్సిజన్ అందడమే కాకుండా, శరీరానికి విటమిన్ ‘డి’ కూడా లభిస్తుంది. కొత్త వాతావరణంలో, కొత్త తరహాలో వ్యామాయం చేయడానికి ప్రయత్నించాలి. గార్డెనింగ్ ఇష్టమైతే, గార్డెనింగ్ అలవాటున్నవారితో కలిసి పనిచేస్తే మరీ మంచిది. దీనివల్ల శరీరానికి వ్యాయామం లభించడంతో పాటు మెదడు కూడా చురుగ్గా మారుతుంది.