Others

లోకానికిక సెలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతనొక నడిచే నిఘంటువు
కవితా పక్షులన్నీ పిల్లలై అతని చుట్టూ
తిరిగేవి
ఉదయాలు సాయంత్రాలు
భీమిలి బీచుల్లో సిగ్గుపడి దాక్కొనేవి
పౌర్ణమి వెలుగులో కీట్స్ పొయెట్రీని
నెమరేసుకుంటూ అలౌకిక ఆనందంలో
లోకానే్న మరిపించేవారు

మూడు భాషల్లో అనర్గళంగా
అప్రతిహతంగా ఉపన్యాస విన్యాసం
మైమరచిపోయే సమయాలు

సభల అనంతరం ఆప్యాయతపు
నదుల్లో పడీ కొట్టుకుపోయే జ్ఞాపకాలు

చెరగని సంతకాన్ని పుస్తకాలపై ముద్రించి
గుండెకి హత్తుకున్న సందర్భాలు

అవన్నీ నిన్నటి గతానికి ప్రతీకలే
తుడిచివేయలేని గుర్తులకి చెరగని సంతకాలే..

కొత్త కోయలలకి మొజాయక్‌లో
గూడుకట్టి
రెక్కలొచ్చేదాకా నడిపిస్తూ
సాహితీ జీవితాన్ని భద్రంగా చూసుకున్న
మనసున్న మారాజు

అనువాదంలో అతిరథ మహామహుల్ని
తెలుగు కవిత్వానికి పరిచయం చేసి
కొత్త ఒరవడి దారులేశాడు

వందల అనువాదాలు
వేల ఆవిష్కరణ సభలు..
కొత్త పరిచయాలు, పాత స్నేహ పరిమళాలు
ఒక్కటేమిటి సమాజాన్ని, సమస్తాన్ని
వదిలేసి దేవలోకాన్ని
తన సాహిత్యంతో
సంతోషపరచడానికి వెళ్లాడు

అలలాంటి జీవితాన్ని తేలిగ్గా తుంచేసి
అందనంత దూరంగా వెళ్లిపోయారు

ప్రేమమూర్తులంటే
దేవుడికి ఇష్టం కావొచ్చు
కల్మషం లేని నవ్వుని
మా నుంచి దూరం చేశాడు

ఇప్పుడు మేమంతా
జీవితానికి సరిపడా విషాదాన్ని
మోస్తూ బతకాలి
అయనా సరే
నీవు చూపిన ప్రేమ బాటలోనే నడుస్తాం!

- పుష్యమీ సాగర్, 9010350317
(ప్రముఖ కవి, సాహితీవేత్త, విమర్శకుడు, అనువాదకుడు రామతీర్థ మృతికి అక్షర నివాళి)