Others

చెట్టు నీడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎండైనా వానైనా
చెట్టు నీడకై పరుగులు
అవి కానరాక కానలేక
మొత్తం మానవుల్ని
ఒకేమారు తిడతావు
పుడమి వేడెక్కుతున్నదని
అందరిమీదా నిందలు
ఒక మొక్క కూడా నాటని
నీ గురివింద తత్వం
ఫలానె్నలా ఇస్తుంది చెప్పు

విత్తు లేనిదే వృక్షం లేదు
ఆలోచన లేని ఆచరణ ఉండదు
గ్రీష్మంలో మాత్రమే గుర్తొచ్చే
పచ్చటి వనాల మాటలు
వేసంగి సెలవులు తీసుకొని
చాలాకాలమైంది చూడు

పృధివిలో తనకంటే ముందు
అవతరించిన మొక్క తల్లులు
పచ్చదనాన్ని ఆచ్ఛాదనంగా
ఈ గోళాన్ని అలంకరిస్తే
మానవుడేం చేశాడు
వినాశనం తప్ప
అందుకే వెంటనే మేలుకో
ఎడారిగా మారుతున్నా
అడుగు ముందుకేయని
నిరాసక్తిని వెంటనే వీడు

ఏసీ గదిలో వాకిలి బిగించి
చల్లగా నిదరోవడం మాను
ఇప్పటికైనా నడుం బిగించు
చీకటిలో చిరుదీపంలా
మోడువారిన ప్రపంచంలో
పచ్చని మొలక నీవే నాటు
నీ మనవలు నిన్ను తలుచుకుంటారు

- జంధ్యాల రఘుబాబు, 9849753298