Others

చెరువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాన జల్లులు కురియగా
నాడు కళకళలాడిన చెరువు

మేఘాల చప్పుడు కానక
నేడు తడిలేక విలవిలలాడుతుంది

బంకమట్టి పండు ముసలి
చర్మంలా వేలాడుతున్న
చెరువు గుండెలు పగిలి
వెక్కి వెక్కి ఏడుస్తుంది

భూగర్భాన్నంటిన చేపపిల్లలు
తాగటానికి నీళ్లు లేక
సూర్యతాపాన్ని తట్టుకోలేక
అస్థిపంజరంలా కమిలిపోతున్నాయ
చల్లని నీరు తాగిన పచ్చని చెట్లు
వసంతంలా సింగారించుకున్న
తరువులన్ని మోడువారిన చెట్లతో
ఎండిపోయన ఆకులతో నిరసన తెలుపుతున్నాయ

మూగజీవాల దాహార్తిని
తీర్చిన గంగమ్మ తీయటి
నీరు త్రాగడానికి పరితపించే
జీవాల గొంతు తడి ఆరేదెన్నడు

నా ఒడిలో పెరిగిన బారెడు
ముళ్లున్న తుమ్మ పొదలు
నా దేహాన్ని గాయపరుస్తుంటే
బాటసారులు నావైపు చూసేదెన్నడో

- కమ్మరి శ్రీనివాస్‌చారి, 9177324124