Others

భరణి... గొప్పవాడవుతాడు ( ఆనాటి హృదయాల..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను ‘్భరణి’ని మొట్టమొదట చూసింది విజయకృష్ణా డబ్బింగ్ థియేటర్ దగ్గర. రాళ్ళపల్లితో కలిసి వచ్చాడు. డార్క్‌బ్లూ జీన్సూ, లైట్ బ్లూ స్టోన్‌వాష్ షర్టూ.. ఇన్‌షర్టూ... చిన్న గడ్డం... ముఖం నిండా పరుచుకొనివుంది. రాళ్ళపల్లితో కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోయాను.
పి రామయ్యశెట్టి ఒకేసారి రెండు సినిమాలకు ఫైనాన్స్ చేస్తున్నాడు. ఒక సినిమా ముద్దుల చెల్లెలు. మరో సినిమా కంచుకవచం. కంచుకవచం సినిమాకి రాజశేఖర్‌రెడ్డి డైరెక్టర్. సుమన్ హీరో అనుకుంటాను. నా సినిమాలో రంగనాథ్, మురళీమోహన్, రాజేష్, రాజేంద్రప్రసాద్, తులసి, ముచ్చెర్ల అరుణ, ప్రభ, జయమాల, సుత్తివేలు, కల్పనారాయ్, చిట్టిబాబు, శివప్రసాదు. అప్పుడప్పుడే పైకి వస్తున్నవాళ్ళు, వచ్చిన వాళ్ళు చాలామంది వున్నారు. అయిదుగురు అసిస్టెంట్లున్నారు. కొత్త కుర్రాడికి అవకాశముండదని చెప్పి పంపించాను. రెండో సినిమాకి డైరెక్టుగా కో డైరెక్టరుగా తీసుకుంటే నాకు చాలా హెల్ప్‌గా వుంటుందని ఆశపడ్డాను.
ఈలోగా భరణి కొంచెం బిజీ అయ్యాడు. యన్‌ఏటి బ్యానరులో లక్ష్మీగణపతి ప్రొడక్షన్సు పేరిట సినిమా చేయాలని త్రివిక్రమరావు ఎదురుచూస్తున్నారు. కథలు వింటున్నారు. నచ్చడంలేదు. మేము స్వయంగా కథలు తయారు చేస్తున్నాం. నచ్చడం లేదు. ఆ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్న కెమెరామన్ లక్ష్మణ్ తీసుకొచ్చాడు భరణిని. త్రివిక్రమరావు ఏదైనా స్టోరీ వినాలంటే నేనూ వుండాలి. 132 యన్‌టిఆర్ వీధి, రంగరాజపురం. త్రివిక్రమరావు ఇంట్లో ఉదయం ఏడున్నర గంటలకే మీటింగు. పెద్దాయనా చిన్నాయనలది టైమంటే టైమే. భరణి సాలి గ్రామంనుంచి రావాలి. రాళ్ళపల్లి ఇంట్లో వుండేవాడు.
నేనూ త్రివిక్రమరావు కూర్చున్నాం. జీను ఫేంటుమీద జుబ్బా వేసుకొచ్చాడు. ఎలాంటి వారికైనా చిన్నాయనకి కథ చెప్పాలంటే భయం. ఆయన మనం కథ చెబుతున్నపుడు సూటిగా కళ్ళల్లోకి చూస్తాడు. ఎదుటివారికి గొంతు పెగలకుండా చేస్తాడు.
భరణి కథ చెప్పిన విధానం కొత్తగా వుంది. ఒక పేడూ పేపర్సూ తీసుకున్నాడు. కథను గ్రాఫ్‌గా గీస్తూ నెరేట్ చేశాడు. కథ స్పూన్ ఫీడింగ్‌లా వుంది. అర్థంకాలేదు అనడానికి అవకాశమే లేకుండాపోయింది. అరగంటలో కథ చెప్పడం పూర్తయ్యింది. ఒక అయిదు నిముషాలపాటు సినిమా కథమీద స్పందన తెలియచేయడానికి గొంతు పెగల్లేదు. అయితే టూఎర్లీ సబ్జక్టు. అదే సబ్జక్టు ఇపుడు తీస్తే సూపర్ డూపర్ హిట్... అంత గొప్పగా వుంది. భరణి మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. ‘కబురు చేస్తాంలే బాబూ!’ అన్నారు చిన్నాయన (త్రివిక్రమరావు).
నన్నడిగారు ఎలా వుందని? నా అభిప్రాయం చెప్పేను. ఆయన్ని అడిగాను. ‘చాలాతెలివైన కుర్రాడు. క్లారిటీవున్న కుర్రాడు. అతడిలో ముందు డైరెక్టర్, తర్వాత రచయిత, ఆ తరువాతే నటుడు. ఇదీ వారి నిశ్చితాభిప్రాయం. ఒక్కోసారి ఆయన మాటలు నిజమేనేమో అనిపిస్తాయి నాకు ‘మిథునం’ సినిమా చూశాక-
భరణిలో ముందు దర్శకుడు.
తర్వాత రచయిత.
ఆ తర్వాతే నటుడు.. రివర్స్‌లో సక్సస్ అయినా.. మళ్లీ దర్శకుడిగా, రచయితగా రాణిస్తాడని ఆశిద్దాం!
నటుడిగా ఒక పాత్రకే పరిమితమైపోతాడు.
అదే దర్శకుడైతే వందమంది నటీనటులను తయారు చేస్తాడు.
రచయితయితే వేలాది పాత్రలను సజీవంగా సృష్టిస్తాడు. ఏవంటారు!

-ఇమంది రామారావు 9010133844