Others

ధనమేరా అన్నిటికీ.. (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘్ధనమేరా అన్నిటికి మూలం... ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం...’ అంటూ, ఇవాళ ఘనమై ధనం రాజ్యమేలుతున్న విషయాన్ని పాజిటివ్‌గా విశే్లషించారు ప్రసిద్ధ కవి దిగ్గజం శ్రీ ఆరుద్ర లక్ష్మీనివాసం సినిమాకోసం. స్వరదిగ్గజం మామ కె.వి.మహదేవన్ సంగీతాన్ని సమకూర్చారు. మధురగాయకుడు గాన కళాలవాల శ్రీ ఘంటసాల గళంలో తేనెల వాన వెల్లువై ప్రవహించింది. రసజ్ఞాన హృదయాలలో కొన్ని దశాబ్దాలుగా. కీర్తిశేషులైన పై వారందరు మనందరి హృదయాలలో చిరంజీవులే.
ఈ చిత్రానికి నిర్మాణ సారధులు టి.గోవిందరాజన్, వీనస్ పద్మిని కంబైన్స్‌వారు- నిర్దేశకులు దర్శక సామ్రాట్ వి.మధుసూధనరావుగారు చిరస్మరణీయులు.
మానవుడు తను తయారుచేసిన డబ్బుకి తానే తెలియని దాసుడయ్యాడు, ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే గుణవంతుడు బలవంతుడు భగవంతుడిగా అభివర్ణించారు కవిగారు. ఇంకా ధనముయొక్క అవసరాన్ని, ప్రాశస్త్యాన్ని ఇలా చెప్తున్నారు. ‘ఉన్ననాడు తెలివిగలిగి పొదుపు చేయరా లేనినాడు ఒడలువంచి కూడబెట్టరా... కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే, కరిగిపోవడంతో పాటు కూలిపోతాయి కాపురాలు’ అంటూ హెచ్చరిస్తూనే ధనలక్ష్మి ఎక్కడెక్కడ కొలువై ఉంటుందో ఇలా సూచిస్తున్నారు. నిత్యశ్రామికులైన కూలివాళ్ళ చెమటలో ఉంటుందని, పాలికాపు కండల్లో ధనమున్నదంటు, శ్రమజీవికి జగమంత లక్ష్మినివాసం... ఆ శ్రీదేవిని నిరసించుట తీరని దోషం అని శ్వాసిస్తూ శ్రామిక శక్తిని అనంత ధనరాశుల నిధిగా పేర్కొన్నారు కవి. చైతన్యాన్ని ప్రబోధిస్తూ. అందుకే ఈ గీతాన్ని ఎవరు నిరశించరు సరికదా బహుదా ప్రశంసిస్తారు.
అందుకే ఈ గీతం... ఈ గీతాన్ని అంత హృద్యమంగా తెరమీద ప్రదర్శించి రక్తికట్టించగా ప్రపంచమే నీరాజనాలు పట్టిన నట చక్రవర్తి విశ్వవిఖ్యాతులు కీ.శే.ఎస్.వి.రంగారావు, అంజలీదేవిగార్లు అభినయించిన ఈ సన్నివేశం, సన్నివేశానికి నప్పిన ఈ గీతమంటే నాకెంతో ఇష్టం. మీకూ అంతేగా... అంతేగా...

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505