Others

మనసే మందిరం (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవిత్రమైన ప్రేమస్థానం చాలా గొప్పది. దానికి మూలం త్యాగం. అటు ప్రేమను, ఇటు త్యాగాన్ని గెలుచుకున్న వ్యక్తి కీర్తి సోపానానికి పాత్రుడు. ప్రేమించిన వ్యక్తికోసం తన జీవితానే్న ఫణంపెట్టి, పదిమంది కోసం ప్రాణమిచ్చే వ్యక్తి దైవసమానుడవుతాడు. అటువంటి ఉత్తమ వ్యక్తి హృదయమే దేవాలయం. అలాంటి మానవుడే అమరుడు. ఈ సారాంశంతో 1966లో తెలుగులో రీమేక్‌గా వచ్చిన గొప్ప చిత్రం మనసే మందిరం. శ్రీ కృష్ణసాయ ఫిల్మ్స్ బ్యానర్‌పై యర్రా అప్పారావు నిర్మించిన చిత్రానికి దర్శకుడు సీవీ శ్రీధర్. అక్కనేని నాగేశ్వర రావు, సావిత్రి లీడ్‌రోల్స్ పోషిస్తే జగ్గయ్య, గుమ్మడి ప్రాధాన్యత కలిగిన పాత్రలు పోషించారు. నిజానికి ఈ సినిమాకు మాతృక తమిళ చిత్రం నేన్జిల్ ఓర్ ఆలయం (1962). ఇదే చిత్రాన్ని దర్శకుడు శ్రీధర్ హిందీలోనూ దిల్ ఏక్ మందిర్ టైటిల్‌తో 1963లో తెరకెక్కించారు. అక్కడ హిట్టవ్వడంతో తెలుగులో మనసే మందిరం పేరిట తెరకెక్కింది. ఇక మలయాళంలో హృదయం ఒరు క్షేత్రం (1976) పేరిట, కన్నడలో కుంకుమ రక్షే (1977) పేరిట రీమేక్ అయ్యంది.
డాక్టర్ రఘు, సీత ప్రేమించుకున్నా సఫలం కాకపోవడంతో అతడు ఒక నర్సింగ్‌హోం స్థాపించి కేన్సర్ రోగులకు చికిత్స చేస్తూ వారి పాలిట దేముడిగా మారతాడు. అనుకోని పరిస్థితులలో రాము అనే వ్యక్తిని పెళ్లిచేసుకున్న సీత, కాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తన భర్తను కాపాడమని వేడుకుంటుంది. ఒకసారి చాటుగా వారి సంభాషణలు విన్న రాము, వారి పవిత్ర ప్రేమను, సీతకు తనపట్ల ఉన్న అనురాగాన్ని గ్రహించి ఏ కారణం చేతనైనా తాను మరణిస్తే డాక్టర్ రఘును పెళ్లి చేసుకోవాలని సీత దగ్గర మాట తీసుకుంటాడు. తన భర్త మరణిస్తే తానూ మరణిస్తానేగానీ ఇతరులను వివాహం చేసుకోబోనని డాక్టర్ రఘుతో సీత గట్టిగా చెబుతుంది. తన సర్వశక్తులు ఒడ్డి రామును బ్రతికించి ఆ శ్రమలో తన ప్రాణాలు కోల్పోతాడు డాక్టర్ రఘు. రాము- సీత అతని జ్ఞాపకార్థం పెద్ద కాన్సర్ హాస్పిటల్ నిర్మిస్తారు. నిజమైన ప్రేమ, త్యాగం, మానవత్వం, మానవ విలువలకు, సంఘర్షణలకు దర్పం పట్టే పాత్రలో అక్కినేని, సావిత్రి, జగ్గయ్య జీవించారు. ప్రముఖ దర్శకుడు శ్రీ్ధర్ ప్రతీ సన్నివేశాన్ని నడిపిన తీరు అభినందనీయం. ఇంత ఉదాత్తమైన చిత్రానికి ఎంఎస్ విశ్వనాధ్ స్వర రచనలో, ఆచార్య ఆత్య్రేక రచనలో జాలువారిన గీతాలు ‘తలచినదే జరిగినదా’ (పి.బి.ఎస్), చల్లగ ఉండాలి (ఘంటసాల), అల్లారుముద్దు కదే (సుశీల) వంటి గీతాలు నేటికీ అలరిస్తున్నాయి. తాను ప్రేమించిన యువతి వేరొకరిని వివాహం చేసుకుని తన దగ్గరకు వైద్యానికి వస్తే ప్రాణదానం చేసి అశువులుబాసిన ఒక వైదుడి కథ. వైద్య వృత్తి గౌరవాన్ని పెంచిన చిత్రం.

-జి మహీత, అనకాపల్లి