AADIVAVRAM - Others
పిల్లల్లారా! పిల్లతెమ్మెరల్లారా!!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 25 May 2019
- ములుగు కుమారస్వామి (షణ్ముఖశ్రీ) 88978 53339
పిల్లల్లారా! పిల్లతెమ్మెరల్లారా
పిండారబోసిన వెనె్నల్లారా
చిరునవ్వుల చిన్నారుల్లారా
మరుమల్లెల పువ్వుల్లారా
తల్లీ తండ్రీ గురువు దైవం
సత్యం, ధర్మం, నీతి, నియమం
నిలకడగా మీ వెంటే వుండి
దీవించాలి, చదివించాలి
తెలివితేటల ఊటలో
ప్రతి పూటా, ప్రతి చోటా
మీ మాటే జగతికి
పూలబాట కావాలి
ఏ పూజకైనా ముందు
ఏకదంతుని పూజలానే
తెలుగు భాషనే ముందు
తెగ చదవాలి ఆ తరువాతే
తక్కిన భాషలను
మక్కువగా చదవాలి
మాతృభాషనూ,
మాతృదేశాన్ని
మరువకుండా జాతిరత్నాలుగా నిలవాలి