AADIVAVRAM - Others

అంటువ్యాధి (సండేగీత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంటువ్యాధి అన్నది ఒక్క వ్యాధులకు సంబంధించినది మాత్రమే కాదు.
చాలా విషయాలు అంటువ్యాధిలా ప్రబలుతాయి.
దుఃఖంతో కూడిన పాటలు, వేదనతో కూడిన పాటలు తరచూ వింటే మన మనస్సులో ఏదో తెలియని వెలితి ఏర్పడుతుంది.
ఉత్సాహంగా వుండే పాటలు, హుషారెత్తించే పాటలు వింటే మనస్సు ఉత్సాసంగా, ఉల్లాసంగా ఉంటుంది.
మనం నిరాశతో వుంటే, దుఃఖంతో వుంటే దాని ప్రభావం మన చుట్టూ వున్న వాళ్ల మీద పడుతుంది.
మనం ఉత్సాహంగా వుంటే ఉల్లాసంగా వుంటే దాని ప్రభావం మన చుట్టూ వున్న వాళ్ల మీద పడుతుంది.
జీవితంలో దుఃఖం వుంటుంది. సంతోషం ఉంటుంది. అది నిజమే!
కానీ మనం నిరాశామయంగా వుంటే ఫలితం ఉండదు.
మన ఉత్సాహం, ఉల్లాసం, వేదన, దుఃఖం అన్నీ అంటువ్యాధిలా ప్రబలుతాయి. మన చుట్టూ వున్న వాతావరణం కూడా అదే విధంగా మారిపోతుంది.
మనం నిరాశతో, దుఃఖంతో వుంటే భవిష్యత్తు మీద ఆశ కన్పించదు.
మనం ఉత్సాహంగా, ఉల్లాసం, ఆశావహ దృక్పథంతో వుంటే మన భవిష్యత్తు కూడా ఆశావహంగా ఉంటుంది. భవిష్యత్తు మీద ఆశ చిగురిస్తుంది.
మనం నవ్వితే మన చుట్టూ వున్న వాళ్లు నవ్వుతారు.
మనం బాధపడుతూ వుంటే చుట్టూ వున్న వాళ్లు ముభావంగా ఉంటారు.
మంచితనం కూడా అంతే!
మన మంచితనం అంటువ్యాధిలా ప్రబలుతుంది.
ఆ విషయం మనం గుర్తించడానికి కొంత సమయం పడుతుంది.
చెడు కూడా అంతే!
నిరాశా అంతే
ఆశావహ దృక్పథం అంతే!
మన చుట్టూ మంచి వాతావరణం వుండాలంటే మనం మంచిగా వుండాలి. ఆశావహ దృక్పథంతో వుండాలి.
అప్పుడు
అవి అంటువ్యాధిలా ప్రబలి మన చుట్టూ మంచి వాతావరణాన్ని కలుగజేస్తాయి.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001