Others

‘ప్యూరిఫైడ్’ నీటితో పలు సమస్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు గ్రామాలలో సైతం భూగర్భ జలాలు అడుగంటిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. అందులోను మంచినీటి బోర్లలో సైతం ఉప్పునీరే వస్తుంది. వాటిని నేరుగా త్రాగలేని పరిస్థితి.
ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ప్యూరిఫైడ్ వాటర్ నేడు గ్రామానికి సోకింది. ఆ నీళ్ళు తప్పితే గొంతారని పరిస్థితి నెలకొన్నదంటే అతిశయోక్తి లేదు. కానీ అసలు సమస్య అక్కడే వచ్చిపడింది. ప్రతి గ్రామంలో ఒకటికి మించి ప్యూరిఫైడ్ సెంటర్‌లను నిర్మించుకొని, త్రాగే నీళ్ళతో వ్యాపారం చేసుకుంటూ రోజుకు వేలలో సంపాదిస్తున్నారంటే అందులో ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు. వ్యాపారం చేసుకోవడంలో ఎలాంటి తప్పులేదు గానీ ఉప్పునీటిని మంచినీటిగా, ప్యూరిఫైడ్‌గా మార్చే క్రమంలో అందులో వాడే రసాయనాలు ఎంత మోతాదులో వాడాలో తెలిసి, తెలియక వాడుతూ నీటిని అమ్ముకోవడం, గత మూడునాలుగైదు సంవత్సరాలనుండి ఆ నీటిని వాడటంతో చిన్నపిల్లలను మొదలుకొని ముసలివారుదాకా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. శరీరంలో ఏదో సత్తువ కోల్పోయి, పట్టుకోల్పోయినట్లు బాధపడే పరిస్థితి నెలకొంది. దీనికితోడు మనం వాడే రసాయనిక ఆహార పదార్థాల కారణమో లేదా ఈ నీటి పుణ్యమో వీటివల్ల ప్రజలు వివిధ అనారోగ్యాల బారినపడి, ఆస్పత్రుల వెంట తిరగాల్సిన పరిస్థితి నెలకొందంటే అందులో ఎలాంటి అవాస్తవం లేదు. ఇలాంటి నీటిని సేవించకుండా ఏవైనా ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషిస్తే, ఎలాంటి జాడ కనబడుటలేదు. ధనవంతులయితే వారు వ్యక్తిగతంగా వేలలో ఖర్చుబెట్టి ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్స్‌ను కొనుగోలు చేసుకొని వాడుకుంటున్నారు. కానీ పేదవారి పరిస్థితుల గురించి ఆలోచించే నాథుడే కరువయ్యారు.
ఈ మహమ్మారి పరిస్థితి నుండి పేదప్రజలను కాపాడటానికి ప్రభుత్వానికి చక్కటి అవకాశమున్నది. ఎంతో ప్రతిష్టాత్మకమైన చేపట్టిన మహోత్తర కార్యక్రమం మిషన్ భగీరథ త్రాగునీటి సమస్యతో అష్టకష్టాలు పడుతున్న ప్రజానీకానికి, గొంతు తడపాలని గొప్ప ఆలోచనతో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా శుద్ధిచేయబడిన మంచినీటిని సరఫరా చేయాలనే దృఢ సంకల్పంతో శ్రీకారంచుట్టి, ఇప్పటికే 90 శాతం పనులు పూర్తిచేసి గ్రామాలకు నీరందించడానికి కృషిచేస్తున్నారు. సమాజక్షేమాన్నీ, సంక్షేమాన్నీ ఆశించే మహోన్నత వ్యక్తులు, సమాజశ్రేయస్సుకు పాటుపడేవారు, సామాజిక సేవా దృక్పథం గలవారు వెంటనే సంఘటితమై ఈ సమస్య పరిష్కారానికి, ప్రభుత్వానికి చేయూతనందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. నవ సమాజ నిర్మాణంలో ముందుగా కనీస అవసరాల కల్పనలో భాగంగా దారిద్య్రరేఖకు దిగువనున్న పేదప్రజలకు అండగా నిలవడానికి ప్రభుత్వంతోపాటు ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని ఆశిద్దాం.

- డా. పోలం సైదులు