Others

పగలే వెన్నెల . (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పగలే వెన్నెల జగమే ఊయల
కదలే ఊహలకే కన్నులుంటే...
ఈ పాట విన్న జగమంతా ఊయలూగింది అనడం ఎంతమాత్రం అతిశయం కాదు. ఈ పాట ప్రతి నోటా ఆలాపనైంది. ఇది ‘పూజాఫలం’ చిత్రం కోసం వ్రాయడం జరిగింది. సినారె కలంలో జాలువారిన ఆ రసమయ గీతం స్వర సాలూరి సంగీత ఝరిలో తేనెలూరింది. సినారేచే ‘అమ్మాయి నీ గొంతు సన్నాయి’ అనిపించుకున్న గానకోయిల ఎస్ జానకి గళంలో పరిపూర్ణంగా రూపుదిద్దుకుని మనకి కర్ణప్రియమైంది. దీనికి కర్త కర్మ క్రియ దర్శకస్రష్ఠ బిఎన్ రెడ్డి. హావభావాలను ప్రదర్శించిన ఆ వదనం... ఆ హసనం... మించి అభినయించిన ప్రహసనం కళాభినేత్రి జమునది. ఆమె నటనా కౌశలానికి అద్దంపట్టింది ఆ గీతం సాగిన దృశ్య సన్నివేశం.
ఈ పాట మకుటంలోనే ప్రస్ఫుటం చేశారు... కవి హృదయంలోని చమత్కారం పదము పదములో కనుపిస్తుంటుంది- ‘కదలే ఊహలకే కన్నులుంటే పగలే వెనె్నల జగమే ఊయల’ అంటూ మొదలెట్టారు అతిశయోక్తితో యుక్తిగా. పాటంతా అంతే రసవత్తరంగా సాగుతుంది. అందుకే అంత చిరంతరంగా గుండెలో మ్రోగుతుంటుంది.
నింగిలోని చందమామ తొంగి చూచె/ నీటిలోన కలువభామ పొంగిపోయె/ ఈ అనురాగమే జీవనరాగమై/ ఎదలో తేనెజల్లు కురిసిపోగా..
కడలి పిలువ కనె్నవాగు పరుగుతీసె/ మురళి పాట విన్ననాగు శిరసునూపె/ ఈ అనుబంధమే మధురానందమై/ ఇలపై నందనాలు నిలిచిపోదా..
నీలి మబ్బు నీడలేసి నెమలి ఆడె/ పూల ఋతువు సైగచూసి సిఖము పాడె/ మనసే వీణగా ఝణఝణ మ్రోయగా/ బ్రతుకే పున్నమిగా విరిసిపోదా..
ముచ్చటైన మూడు చరణాల గీతానికి పటిష్టమైన పల్లవి చరణాంత్యములో పల్లవించగా ప్రకృతి పరవశించి పాటలోని ఇతివృత్తం... కావ్యవస్తువులు రసమయ హృదయాల పల్లవించగా వెనక్కి తీస్తుందా!!! ఆలాపన చేయగా రసమయులు నిరసిస్తారా.
అందుకే ఈ పాట నాకెంతో కమనీయం- సినారె ఎంచుకున్న కవితా వస్తువులు బహు రమణీయం.

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505