Others

మంచి మనసులు (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1962లో బాబూ ఆర్ట్స్ బ్యానరుపై సహజసిద్ధమైన సన్నివేశాలు, సంభాషణలు, అభినయాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు ఆదుర్తి మార్కు సినిమా మంచి మనసులు. మంచితనానికి పేద- గొప్ప అనే తావుండదని చాటిచెప్పిన చిత్రం. తమ్ముడి చదువుకోసం తన ఆరోగ్యాన్ని ఫణంగాపెట్టి గుమ్మడి ఏఎన్నాఆర్‌ను పట్నంలో చదివిస్తుంటాడు. అన్నకు భారం కాకూడదని ఆలోచిస్తాడు ఏఎన్నార్. పేద విద్యార్థులకు సాయం చేసే ఎస్వీ రంగారావు ఇంట చేరతాడు. అతని సలహాతోనే వివాహమైందని అతని భార్య సూర్యాకాంతానికి అబద్ధం చెప్పి వసతి, భోజనం సంపాదిస్తాడు. కానీ అతని కుమార్తె సావిత్రి ఈ విషయాన్ని పసిగట్టి అతన్ని ప్రేమించడం, వివాహానికి ఇంట్లోవారు అంగీకరించడం జరుగుతుంది. తీవ్ర అనారోగ్యంపాలైన అన్నను చూడడానికి వస్తాడు ఏఎన్నార్. కూతురు వాసంతి పెళ్లి బాధ్యత తీసుకుంటానని తమ్ముడినుంచి వాగ్దానం తీసుకుని మరణిస్తాడు అన్న. ఊళ్లోనేవున్న నాగభూషణాన్ని చెల్లెలు ప్రేమించిందని తెలుసుకుని, అతనితో వివాహం జరిపించడానికి ప్రయత్నిస్తాడు. అందులో భాగంగా గత్యంతరం లేని పరిస్థితుల్లో అతని అంధురాలైన చెల్లెలు జానకిని వివాహం చేసుకోవాల్సి వస్తుంది. మధ్యలో అతని కాపురం చూడటానికి వెళ్లిన సావిత్రి, అది సవ్యంగాలేదని గ్రహించి అతనికి హితబోధ చేయడంవలన తన తప్పును తెలుసుకున్న ఏఎన్నార్ భార్యను ప్రేమతో ఆదరించి యాత్రలకు తీసుకెళ్తాడు. ఒకదగ్గర నాగభూషణం తన ప్రియురాలిని హత్యచేసి పారిపోడం చూసిన అక్కినేని, తన అన్న కూతురు జీవితం నిలబెట్టడానికి ఆనేరం తనమీద వేసుకుని జైలుకు వెళతాడు. కానీ అతని స్వభావం తెలిసిన సావిత్రి అతని తరఫున లాయర్‌గా, ఆమెకు వ్యతిరేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా రంగారావు కోర్టులో తలపడతారు. తన భర్తే హంతకుడని తెలుసుకున్న వాసంతి సాక్ష్యాధారాలను కోర్టుకి సమర్పించడంతో ఇందరి మంచి మనసుల మధ్య తనలాంటి చెడ్డవారు ఉండరాదని నిజాన్ని అంగీకరించడంతో ఏఎన్నార్ విడుదలవుతాడు. ఇందులో మహాదేవన్ అందించిన స్వరాలకు ఘంటసాల, సుశీల, జమునారాణి, జానకి పాడిన గీతాలు ‘అహో ఆంధ్రభోజా’, ‘నన్ను వదలి నీవు పోలేవులే’, ‘ఏమండోయ్ శ్రీవారు’, ‘ఎంత టక్కరివాడు’లాంటి గీతాలతోపాటు ‘మావా మావా మావా’ గీతం సంచలన హిట్‌గా నిలిచింది. ఎస్వీఆర్, ఏఎన్నార్, సావిత్రి, జానకి, నాగభూషణం పోటీపడి అభినయించారు. ఈ చిత్రానికి సెల్వరాజ్ ఫొటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణ. ఆణిముత్యం లాంటి చిత్రం మంచి మనసులు.

-ఎస్‌ఎస్‌శాస్ర్తీ,విశాఖపట్నం