Others

నవరస రాళ్లపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరోగా నటించేవారికి కొన్ని పడికట్టు పాత్రలుంటాయి. అలాగే కేరెక్టర్ ఆర్టిస్టుకి వారికి తగ్గ గుండెపోటు పాత్రలూ ఉంటాయి. కానీ రాళ్ళపల్లిలాంటి నటుడికి ఈ పాత్రలే ఖచ్చితంగా
సరిపోతాయి అన్నమాట ఏ దర్శకుడినుండీ వినలేం.
తాగుబోతు మొగుడుగా రాధాకల్యాణంలో బాపు చూపించారు. ‘ఏం మొగుడో ఏం మొగుడో వద్దంటే వినడేమి ఓరి దేముడో.. తాగవద్దంటే వినడేమి ఓరి దేవుడో’ అన్న పాటలో ఏ హీరోలకు తక్కువ కాకుండా నృత్యం చేశారు రాళ్ళపల్లి. చలిచీమలులో స్వీయగానంలో ‘్భమి పాయె పుట్ర పాయె’ అన్న గీతంలో ఆయన నర్తనం ఏ హీరోకి తీసిపోనిది. ఇక్కడ దర్శకుడు రాళ్ళపల్లిలో ఓ విప్లవకారుణ్ణి చూశాడు. విలనిజం ప్రదర్శించే పాత్రను వంశీ అనే్వషణలో ఇచ్చాడు. కానీ అది సాత్విక విలనిజం. మనిషి రాళ్ళపల్లి పాత్రలు అనేకం. సాత్విక, రౌద్ర, భయానక, బీభత్స రసాలు ఏదైనా సరే.. రాళ్ళపల్లి ముందు తలొంచాల్సిందే. తాగిన నిజం చెప్పే హరిశ్చంద్రుని పాత్రను ఏ దర్శకుడైనా ఏ ప్రేక్షకుడైనా ఎలా ఊహించుకోగలడు? దానికి సమాధానం ఊరుమ్మడి బ్రతుకులలో రాళ్ళపల్లి పాత్రలో కన్పిస్తుంది.
చిన్నప్పటినుండే నటనను ఆరాధిస్తూ తన ఇంటి పక్కన పిల్లలకు మేకప్పులు వేసి వీధి అరుగుమీద నాటకాలు ఆడించిన దర్శక నటుడాయన. ఎన్నో నాటకాలు రాశాడు. ఆ నాటకాలన్నింటికీ తానే దర్శకత్వం వహించారు. అలా తనలోని నటుణ్ణి తెరపై ఆవిష్కరించాలని దర్శకుడు ప్రత్యగాత్మకు ధైర్యంగా ఒక లేఖ రాశాడు. ‘‘నేను అంత ఎత్తు కాదు. అందగాణ్ణి కాదు. కానీ పదిహేనేళ్ళ నాటకానుభవం వుంది. హీరోగా పనికిరాను కానీ ఏ పాత్ర ఇచ్చినా చేస్తా’’ అన్న తమాషా అయిన ఉత్తరాన్ని చూసి ప్రత్యగాత్మ ‘స్ర్తి’ అనే చిత్రంలో తొలి అవకాశం ఇచ్చారు. ఇక అప్పటినుండి ఆయన ఓవైపు నాటకాలు మరోవైపు సినిమాల జోడెద్దుల బండిపై సవారీ చేశారు. ఏ పాత్ర అయినా సరే రాళ్ళపల్లి నటిస్తున్నాడు అంటే అది అద్భుతంగా వుంటుంది అనిపించేలా చేశాడు, సినిమా చూడకుండానే. అలా 1960లో ముఖానికి రంగు వేసుకున్న ఆయన చనిపోయేంతవరకూ అది ఆపలేదు. చిల్లరదేవుళ్ళు, చలిచీమలు, ఊరుమ్మడి బ్రతుకులు, తూర్పు వెళ్ళే రైలు, సితార, సీతాకోకచిలక, పండంటి కాపురానికి 12 సూత్రాలు, అనే్వషణ, బొంబాయి, శ్రీవారికి ప్రేమలేఖ లాంటి అద్భుతమైన చిత్రాలలో తన ప్రతిభ ఏంటో చూపించారు. అలా తన కెరీర్‌లో 8వేల నాటకాలు, 850 సినిమాలు చేశారు. జంధ్యాల, వంశీ చిత్రాలలో తప్పనిసరిగా ఆయనకో పాత్ర ఉండేది. నమస్తే- తెలుగు, వణక్కం-తమిళం... ఇలాంటి మేనరిజమ్‌తో రెండు రెళ్ళు ఆరు చిత్రంలో ఆయన చేసిన తికమక పాత్ర అప్పుడో సంచలనం రేపింది. ‘కశ్మీ కరాకండీ, జస్మీ జరాజండి’ అన్న కొండదేవర మాండలికంలో ఆయన పాత్ర తుమ్మచెట్లమధ్య చందమామ వోలె లేడీస్ టైలర్‌లో మెరిసింది. శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ చిత్రంలో- ‘వీడెవడండీ చీపుగా’ అన్నమాటతో మార్కులు కొట్టేస్తారు ఆయన. అనే్వషణలో కామెడీతో సాగే విలనీ పాత్ర చిట్టచివరకు వంశీ ఆవిష్కరించినా, దాన్ని అద్భుతంగా పండించింది రాళ్ళపల్లే. హీరోకి మచ్చ పిచ్చి పట్టించే కొండదేవరగా ‘మచ్చ మచ్చ ఉండాలె.. లేకుంటే మసైపోతవ్’ అన్న డైలాగ్ ఎవరు మర్చిపోగలరు. త్రివేది యమదర్శనం, మృచ్ఛకటికం లాంటి అద్భుతమైన నాటకాలలో రాళ్ళపల్లిని ఢీకొట్టే నటుడే లేరు. సీతాకోకచిలకలో ఒరే కోటయ్య లోపల పులుసు మరుగుతోందిరా అన్న తర్వాత గుడిసెలోంచి వచ్చే తన యజమానిని చూసిన ఆయన హావభావం, జీతం తీసుకొని వెళ్ళమన్నప్పుడు యజమానురాలితో ఆయన మాట్లాడిన మాటలు ఒళ్ళు గగుర్పొడుస్తాయి. రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు, ఎన్‌టిఆర్ జాతీయ అవార్డు, బి.ఎన్.రెడ్డి అవార్డు, నాగిరెడ్డి-చక్రపాణిల అవార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. సినిమా ప్రయోజనం అంటే ప్రేక్షకుణ్ణి చెడగొట్టకుండా ఉండడమే అనే ఆయన బూతు కామెడీకి నటీనటులు కారణం కాదని ఆయా దర్శకులే కారణమని, నటులు కేవలం కీలుబొమ్మలు మాత్రమేనని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. నాటకం సజీవమైనది. దానికి చావులేదు. భుక్తికోసం సినిమా, ఆత్మసంతృప్తికోసం నాటకాలు వేస్తున్నానంటూ చెప్పే ఆయన నిజంగా కర్మయోగే! ఆయన లేకపోయినా వెండితెర ఆయనను తన హృదయంపై ఆవిష్కరించుకుంటూ గుర్తుచేసుకుంటూనే ఉంటుంది.
-జి రాజేశ్వర రావు

ఆయనతో నాటకం ఆడా
రాళ్ళపల్లి డిక్షన్ సరికొత్తగా ఉండేది. తొలి రోజుల్లో ఆయనతో నాటకం ఆడాను. చాలా నాటకాలు రాశారు. చక్కటి దర్శకుడు కూడా. ఆయన టైమింగ్ అద్భుతం. అగ్ని, అమ్మ నా కోడలా సినిమాల్లో మా ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే సీన్లు బాగా పండాయి. పరిశ్రమలో అనేకమంది పెద్దవారు వెళ్లిపోతున్నారు. ఆయన గురించి చెడుగా ఒక్కరూ మాట్లాడింది నేను చూడలేదు. వంటలు బాగా చేసేవారు. మీకు నేను వండిపెడతానని, ఓ పెద్ద హీరోయిన్‌కి వండి పెట్టానన్న తృప్తి నాకుండాలని ఆయన అడిగేవారు. డబ్బులకోసం ఎవరినీ ఎనాడూ ఇబ్బంది పెట్టలేదు. స్వంత ప్రతిభతో ఎదిగిన గొప్ప కళాకారుడాయన.

పరిశ్రమకు నష్టం
నాకున్న మంచి స్నేహితుల్లో ఆయనొకరు. మంచి నటుడు. మంచి మనిషి, గొప్ప స్నేహితుడు. అందరికీ ఇష్టమైన వ్యక్తి. ఇంత త్వరగా వెళ్లిపోవడం వ్యక్తిగతంగా నాకు చాలా నష్టం. పరిశ్రమకు లాస్. ఇలాంటి మంచివాళ్లు ఎక్కువకాలం బ్రతికితే సమాజానికి, పరిశ్రమకు ఉపయోగపడేవాళ్ళు అవుతారు. కానీ భగవంతుడు ఇలాంటివారిని త్వరగా తీసుకువెళతాడు ఎందుకో?
మంచికి మారుపేరు
రాళ్లపల్లి అంటేనే మంచికి మరో పేరు. ఆయనలాంటి గొప్ప వ్యక్తిని పరిశ్రమలో చూడలేదు. ఆయన పరిశ్రమలో అందరికీ కావాల్సిన వ్యక్తి. ఆయన పనేంటో చూసుకునేవాడు తప్ప ఒకరిని ఇబ్బంది పెట్టడం, కామెంట్ చేయడం లాంటివి ఏనాడూ లేదు. ఆయన ఎక్కడుంటే అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. మంత్రిగారి వియ్యంకుడు, శ్రీవారికి ప్రేమలేఖ, ప్రతిధ్వని, పుణ్యభూమి కళ్లు తెరిచిందిలాంటి చిత్రాలలో మేమిద్దరం కలిసి నటించిన సన్నివేశాలు అద్భుతంగా పండాయి. ఆయన ఏనాడూ విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడేవాడు కాదు.
30 ఏళ్ళ పరిచయం
నాటకాలు, సినిమాలలో జోడెద్దుల బండిలా ఆయన నటించేవారు. 30ఏళ్ళనుండి పరిచయం. మంచి మిత్రుడు. నాటకం అంటే ఖర్చులన్నీ భరించేవారు. అనేక గుప్తదానాలు చేశాడు. 1992లో నేను, సుత్తివేలు, శరత్‌బాబు, ఆయన కలిసి అమెరికాలో నెలరోజులపాటు నాటకాలు ఆడాం. ఇటీవలే ‘పట్టాలు తప్పిన బండి’ నాటకాన్ని హైదరాబాద్, గుంటూరులలో ప్రదర్శించాం. రెండు రోజులకోసారి ఫోన్ చేస్తాడు. వీలుకాదంటే నేనే వచ్చి కలుస్తా అంటాడు. ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. ఇంటికి ఎవరు వచ్చినా వారికి కడుపునిండా భోజనం పెట్టనిదే వదలడు.