Others

గుందిమళ్ల... జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో పుష్కరాలను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించే గుందిమళ్ల ఘాట్ జలకళతో ఆకట్టుకుంటోంది. ఇక్కడి ఘాట్‌లో విశాలమైన 9మెట్లు ఏర్పాటు చేశారు. వాటిలో 8 ఘాట్లపై రెండడుగుల మేర జలాలు చేరాయి. శుక్రవారం ఉదయానికి మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక సోమశిల ప్రాజెక్టులో 70 అడుగుల మేర శ్రీశైలం జలాలు చేరుకున్నాయి. అక్కడి సంగమ ప్రాంతమూ పుష్కల జలాలలో కళకళలాడుతోంది. బీచుపల్లివద్ద కావలసినంత నీరు చేరగా అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక చిహ్నాలు, విద్యుత్ కాంతులు ఆకట్టుకుంటున్నాయి. రంగాపురం, బీచుపల్లి ఘాట్‌లలో 400 అడుగుల పొడువున ఏర్పాటు చేసిన ఘాట్లను ఇప్పటికే కృష్ణమ్మ ముద్దాడింది. మొత్తంమీద జలకళతో పుష్కరాలు అందరినీ రారమ్మని ఆహ్వానిస్తున్నాయి.

చిత్రం.. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించనున్న గుందిమళ్ల పుష్కర ఘాట్ వద్ద జలకళ