Others

శేష శైలావాసా (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘శేష శైలావాసా శ్రీవేంకటేశా/ శయనించు మా అయ్య శ్రీ చిద్విలాసా..’ ఈ మకుటంతో మకుటాయమానమైన ఈ భక్తిగీతం చిరంతరం నిరంతరం భక్తుల హృదయాలను అలరిస్తోంది. ఈ గీతం అందుకే అయ్యింది అప్పటికీ, ఇప్పటికీ మరెప్పటికీ అజరామరం.
మనసుకవి ఆచార్య ఆత్రేయ కలంలో పొంగి.. పెండ్యాల స్వరఝరులందొదిగి ఒదిగి.. గాన కళావాల ఘంటసాల గళంలో తెనెల వెల్లువై.. భక్తవరేణ్యులకి కర్ణామృతమే అయ్యింది. ఆ భక్తిరసధార ఆంధ్రుల, ఆంధ్రేతరుల హృదయాల జీవధార రమారమి ఏడు దశాబ్దాలుగా ప్రవహిస్తూనే ఉంది. దీనికి సారథి.. భక్తులకి, భవగంతుడికి వారథి పి పుల్లయ్య దర్శక పితామహుడవడం ముదావహం -ఇది తెరవెనుకవారి పరిచయం.
ఇక పాటలోకి వెళ్తే ఒక్కొక్క చరణం ఒక్కొక్క తీరుగా.. నేరుగా.. భక్తులకి అత్యంత చేరువయ్యే పద పరిమళాలతో, స్వర సౌరభంతో, గంధర్వులా గానం చేసిందన్నటుల భావన కలిగిస్తుంది.
శ్రీదేవి, అలమేలు మంగమ్మలైన ముద్దుసతులిద్దరిని ఇరువైపులా చేసి మురిపించి లాలించటంలో.. ముచ్చటల ఊయలూగించటంలో ఇసుమంతైనా సతులిద్దరికీ అలుక రానీయకు.. శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు.. మరి అలమేలు మంగకు అలుక రానీయకంటూ కవి చమత్కరించారు భక్తిపారవశ్యంతో.
రెండవ చరణంలో భగవంతుడుకి అతిచేరువయై మెత్తటి పదలాలిత్యంతో స్వామికి మెత్తలు పరచి పట్టుపాన్పుపై పవ్వళించర స్వామి భక్తులందరు నిను ప్రస్తుతించి పాడ, చిరునగవులొలుకుచు నిదురించు నీ మోము తనివితీరాగాంచి తరియించేమయా మేము.. ఒకపరి మమ్మాశీర్వదించవయా మా ఈ సేవలంది అంటూ సాగింది భక్తిగీతం.
ఏమాత్రం పౌరాణిక స్పర్శ ఎరుగని మనసుకవితో భక్తి చిత్రానికి రచన చేయించగా పూనుకోవటం పి పుల్లయ్యకు ఆత్రేయపైగల అచంచల విశ్వాసానికి నిదర్శనం. అందుకే ఆయన చేశారు ఇంత సాహసం. వారిరువురి సంకల్పానికి స్వామివారి ఆశీర్వాదం లభించిందనే చెప్పాలి. మీరూ ఈ పాటను అంతే వాసితో వింటే ఈ భావనలే చెప్తారు తప్పకుండా.

ఆచార్య క్రిష్ణోదయ, 7416888505