Others

రాజేంద్రప్రసాద్ - గోచీ ( ఆనాటి హృదయాల..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రప్రసాద్ అప్పుడప్పుడే పైకొస్తున్నాడు. నాలుగైదు సినిమాల్లో మంచి రోల్స్ వేస్తూ -పాత్రలకు న్యాయం చేస్తున్నాడన్న మంచి పేరుంది. నేను ‘ముద్దుల చెల్లెలు’ సినిమా డైరెక్ట్ చేస్తున్నాను. అందులో నూతనప్రసాద్ కొడుకుగా ‘ముద్దుల చెల్లెలు’ని పిచ్చిగా ప్రేమించే పిచ్చి పాత్ర ఒకటుంది. దానికి రాజేంద్రప్రసాద్ అయితే న్యాయం చేస్తాడని తీసుకున్నాం.
‘ముద్దుల చెల్లెలు’ చిత్రంలో హీరోలు ఇద్దరు. రంగనాథ్, మురళీమోహన్. ముద్దుల చెల్లెలుని పెళ్లి చేసుకొనే పాత్రలో రాజేష్ (ఆనందభైరవి ఫేం) నటించాడు. సినిమా ప్రారంభమయ్యింది మొదలు ప్రసాదు (నేనిలాగే పిలిచేవాడ్ని) యూనిట్‌తో కలిసి వుండేవాడు. షూటింగు జరుగుతుంటే శ్రద్ధగా గమనించేవాడు. తనకేమన్నా సీన్సున్నాయని తెలిస్తే, ముందుగా సీను పేపర్ల కోసం ప్రాణం తీసేవాడు. ఆ సీను పేపర్లను చదివి ఔపాసన పట్టేసేవాడు. తన డైలాగ్సుని మాత్రమే కాకుండా కాంబినేషనులో వుండే డైలాగుల్ని సైతం కంఠతా పట్టేసేవాడు. సెట్‌లో ఎప్పడూ నవ్వుతూ నవ్విస్తూ వుండటం ఆయన ప్రత్యేకత. ఆ కామెడీలో కూడా ఎవరూ హర్ట్ అవ్వకుండా చూసుకొనేవాడు.
తన షూటింగు జరిగిన ముందురోజు వచ్చి గురువుగారూ, నేనింతవరకూ పిచ్చుకగూడు లాంటి సొంత హెయిర్‌తో నటించాను. మన సినిమాలో విగ్గు ట్రై చేద్దామా? అని అడిగాడు. నేను ఆలోచనలో పడ్డాను. విగ్గంటే ఆర్డరివ్వాలి. అది వచ్చేసరికి కనీసం రెండురోజులు పడుతుంది. నా ఆలోచనల్లోంచి తేరుకోకముందే -నేనే విగ్గురెడీ చేసి పెట్టుకున్నాను. బావుంటుందో లేదో చూడండి. మీరు బావుంటుందంటే- ఓకే చేస్తే దునే్నద్దాం అన్నాడు సరదాగా. విగ్గుపెట్టుకొని చూపించాడు. బావుంది. తులసిని టీజ్ చేసే అల్లరి పాత్రకు అతికినట్టు సరిపోయింది.
మరుసటిరోజు -మద్రాసుకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఓ పల్లెటూరు వుంది. అక్కడ పాతతరం ఇల్లు. పొలాలూ వున్నాయి. పచ్చని చెట్లూ చేమలతోబాటు బోరుబావులు కూడా వున్నాయి. పైగా అక్కడ షూటింగులు ఎక్కువగా జరుగుతుంటాయి. జనం రద్దీ వుండదు గనుక అక్కడే రాజేంద్రప్రసాద్, తులసిల మీద సీన్లు ప్లాన్ చేశాం.
తులసి తన అన్న రంగనాథ్‌కి కేరియర్ తీసుకొస్తుంది. ఒంటరిగా కనిపించిన తులసిని చూసి ఎగిరి గంతేస్తాడు. రాజేంద్రప్రసాద్‌కి ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా ‘లలలూలీ’ అనే ఊతపదం ఉపయోగిస్తాడు. సినిమాలో చాలా బాగా పేలింది. తులసిని టీజ్ చేస్తాడు ప్రసాదు. సూటు బూటూ హాటూ బైనాక్యులర్‌తో వెంటపడతాడు. తులసి వడివడిగా నడుస్తుంది.
ఇంతలో షడన్‌గా ఓ థాట్ వచ్చింది. ‘ప్రసాద్! ఒక పని చేస్తావా?’ అన్నాను.
‘చెప్పండి గురువుగారూ! ఈ కాలువలోకి దూకేమన్నారా? నీళ్ళు లేని ఈ బావిలోకి దూకెయ్‌మన్నారా? నేను రెడీ!’ అన్నాడు.
‘అంత త్యాగం చెయ్యనవసరం లేదు గానీ... హాటూ, కళ్ళద్దాలూ, బైనాక్యులర్, బూటూ అలాగే వుంచు... గోచీ కట్టుకో. సీను బాగా పండుతుంది’ అన్నాను.
క్షణం ఆలోచించకుండా ఆ పొలం గట్లమీదే సూటూ బూటూ విప్పేసి గోచీతో సిద్ధమయ్యాడు. ఎందుకంటే ‘లలలూలీ’ అని ఏడిపిస్తుంటే అన్న రంగనాథ్ వచ్చి చింతబరిసెతో కొడుతున్నట్టు ఇమేజినేషన్ షాట్ తీశాం. చాలా సహజంగా వచ్చింది. ‘ముద్దుల చెల్లెలు’ సినిమాలో రాజేంద్రప్రసాద్‌కి చాలా మంచి పేరొచ్చింది. బహుశా అది మూడో పిక్చరో... నాలుగోదో.
-అయనా..
రెండువందల సినిమాలు పూర్తయిన సందర్భంగా ఇరవైమంది దర్శకులను తొలిరోజుల్లో చిత్రాలనిచ్చి ప్రోత్సహించిన వారిని సన్మానం చేశాడు. అందులో నేనూ ఒకడ్ని. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని చెప్పడానికి రాజేంద్రప్రసాద్ చక్కటి ఉదాహరణ.

-ఇమంది రామారావు 9010133844