Others

రాఖీ దుమారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ హాట్ బాంబ్ రాఖీసావంత్ గుర్తుందిగా.. అయినా ఆమెను మరిచిపోయినపుడల్లా ఏదో దుమారం రేపుతూ మరిచిపోకుండా చేస్తూనే ఉంటుందిలెండి. తాజాగా ఈ అమ్మడు పాకిస్తాన్ జెండా పట్టుకుని దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. అసలే పాకిస్తాన్ విషయంలో ఫైర్‌మీదున్న ఇండియన్స్ ఊరుకుంటారా.. రాఖీ సావంత్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ గుప్పిస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. అసలు నీకు పాకిస్తాన్ వారసత్వమే కరెక్ట్.. నువ్వు మిస్ పాకిస్తాన్ అంటూ విమర్శిస్తున్నారు. ఇలాంటి పిచ్చిపనులు చేస్తే నిన్ను అస్సలు ఫాలో అవ్వం అంటున్నారు నెటిజన్లు. దాంతో అవాక్కయిన రాఖీసావంత్ దాన్ని కవర్ చేసుకునే పనిలో పడింది. ఈ నేపథ్యంలో తాను కావాలని పాకిస్తాన్ జెండా పట్టుకుని ఫొటోలకు ఫోజులివ్వలేదని, ఇది ధారా 370 అనే సినిమాలో తాను పాకిస్తానీ అమ్మాయిగా నటిస్తున్నానని, దానికోసమే ఇలా పాక్ జెండా పట్టుకున్నానని తెలిపింది. అంతే కాదండోయ్.. పాకిస్తానీ ప్రజలంతా చెడ్డవారు కాదని.. ఎవరో కొందరుమాత్రమే జిహాద్ పేరుతో అరాచకాలు చేస్తున్నారని తెలిపింది. నాకు పాకిస్తాన్ అన్నా.. ఆ దేశ ప్రజలన్నా చాలా గౌరవం అని తెలిపింది. రాఖీ సావంత్ యవ్వారం చూస్తుంటే, కావాలని ఇలా పాకిస్తానీ జెండా పట్టుకుని ఫొటోలు దిగి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిందనే విమర్శలు కూడా వస్తున్నాయి. చేతిలో సినిమాలు లేకపోవడంతో తనను మరిచిపోతారనే భయంతో ఇలా కావాలని పబ్లిసిటీ స్టంట్ చేసిందని విమర్శిస్తున్న వారూ ఉన్నారు.