Others

కృష్ణవేణిలో అంతర్లీనంగా దత్తాత్రేయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుడి అవతారమైన దత్తాత్రేయుడు కృష్ణానదిలో అంతర్లీనంగా ఉన్నారని భగవాన్ విశ్వయోగి విశ్వంజీ పేర్కొన్నారు. శుక్రవారం నుండి ప్రారంభమయ్యే కృష్ణాపుష్కరాల సందర్భంగా ఆంధ్రభూమి ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ, కృష్ణానది జన్మస్థలమైన సహ్యాద్రి దత్తాత్రేయుడి స్థిరనివాసమని గుర్తు చేశారు. కలియుగంలో దత్తాత్రేయుడి తొలి అవతారమైన శ్రీపాదవల్లభుడు కృష్ణానది మధ్యలో కురుమపురం (కురుమగడ్డ)లో నివాసం ఉన్నారని, ఆ తర్వాత కృష్ణానదిలో అదృశ్యమయ్యారన్నారు. నృసింహసరస్వతి దత్తాత్రేయుడి ద్వితీయ అవతారమని, ఈ అవతారంలో ఘాన్గాపురంలో నివాసం ఉన్నారని, చివరలో శ్రీశైలం వెళ్లి కదళీవనంలో తపస్సు చేశారని అన్నారు. శ్రీశైలం వద్ద పాతాళగంగ (కృష్ణ)లో అంతర్థానమయ్యారని వివరించారు. కృష్ణానది ఒడ్డున పవిత్రమైన క్షేత్రాలు శ్రీశైలం, వేదాద్రి, మట్టపల్లి, వాడపల్లి, మోపిదేవి, విజయవాటిక, కళ్లేపల్లి తదితరాలు ఉన్నాయన్నారు. కృష్ణ జన్మస్థలమైన సహ్యాద్రి వద్ద వాసుదేవానంద సరస్వతి పాదయాత్ర ప్రారంభించి మధ్యలో అన్ని దివ్యక్షేత్రాలు సందర్శిస్తూ, బంగాళాఖాతంలో కృష్ణకలిసే హంసలదీవి వరకూ వెళ్లారని గుర్తు చేశారు.
జలాల్లో దేవతాశక్తి
కృష్ణా పుష్కరాల సమయంలో ముక్కోటి దేవతలు, 33 కోట్ల దేవతాగణం నదిలో నివాసం ఉంటారన్నారు. పుష్కరాల సమయంలో యోగులు, పీఠాధిపతులు, మహాత్ములు నదీస్నానం చేస్తారని, అందువల్ల వారి శక్తి నదిలోకి చేరుతుందని, అందుకే నదీజలాలు మరింత శక్తివంతమై ఉంటాయన్నారు. పుష్కరస్నానం చేయడం వల్ల సకలదోషాలు హరించుకుపోతాయని, మనిషి శక్తివంతం అవుతారని అన్నారు. ‘ప్రకృతే పరమాత్మ’ అంటూ సనాతన ధర్మం చాటిచెబుతోందని విశ్వంజీ పేర్కొన్నారు. విశ్వశక్తి స్వరూపం ప్రకృతి రూపంలో ప్రకటితమవుతుందన్నారు. ప్రకృతి పంచభూతాత్మకమని, విశ్వమంతా జలమయమేనని, మనం నివసించే భూమిపై మూడు వంతులు జలమే ఉంటుందని, అలాగే మనిషిలోకూడా మూడువంతులు రసస్వరూపంలో ఉన్నది జలమేనని వివరించారు. జలాన్ని రక్షించుకోవాలని, పూజించాలన్నారు.
నదులకు పూజలు ఎందుకంటే...
నదులకు కృతజ్ఞత తెలియచేసేందుకే పూజలు నిర్వహిస్తున్నామని, ప్రత్యేకంగా పుష్కరాల సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. కృష్ణమ్మ ప్రజలను అనుగ్రహిస్తే ఈ ప్రాంతంలో పాడిపంటలకు కొదవ ఉండదన్నారు. నదీమతల్లిని ఏ విధంగా పూజిస్తామో, పుష్కరాల సమయంలో మన పితృదేవతలను కూడా పూజించేందుకు ‘పిండప్రదానం’ చేస్తున్నామని స్వామి తెలిపారు. శ్రాద్ధవిధుల వల్ల నదీజలాలు పవిత్రమవుతాయే తప్ప కలుషితం కావని స్పష్టం చేశారు.

- ఆంధ్రభూమి ప్రతినిధి, హైదరాబాద్