Others

నవీన ఆవిష్కరణలతో సుస్థిర ప్రగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాంకేతికత అండతో మన దేశం వివిధ రంగాల్లో ఇప్పటికే తిరుగులేని అభివృద్ధిని సాధించింది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణల వల్ల నేడు అగ్రరాజ్యాల సరసన భారత్ నిలిచింది. 1998 మే 11వ తేదీన భారత ప్రభుత్వం రాజస్థాన్‌లోని పోఖ్రాన్ వద్ద అణుబాంబు పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ఈ కారణంగా 1999 నుంచి ప్రతి సంవత్సరం మే 11న ‘జాతీయ సాంకేతిక దినోత్సవం’ పాటించడం ఆనవాయితీగా మారింది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మన దేశం సాధించిన ప్రగతిని యావత్ ప్రపంచం గుర్తించింది. మానవాభివృద్ధి క్రమంలో ‘సైన్స్’కు అనాదిగా ఎంతో ప్రాధాన్యత ఉంది. అన్ని రంగాలలో ‘సైన్స్’ వినియోగాన్ని ‘సాంకేతిక ప్రగతి’గా అభివర్ణిస్తారు. వ్యవసాయ, పారిశ్రామిక, రక్షణ, అంతరిక్ష, సాఫ్ట్‌వేర్, సమాచార వ్యవస్థ, విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు రావడానికి సాంకేతికత ఎంతగానో దోహదం చేసింది. ఈ రంగాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులు మానవ జీవనాన్ని మరింత సులభతరం చేశాయి. అంతరిక్ష పరిశోధనలో, అణ్వస్త్ర రంగంలో ఇప్పటికే మన దేశం ఎన్నో ప్రయోగాలు చేసి ఇతర దేశాలకు మార్గదర్శకంగా నిలిచింది.
సామాజిక, ఆర్థిక రంగాల్లో దేశం అభివృద్ధిని సాధించడంలో సాంకేతిక పరిజ్ఞానం పాత్ర చాలా గొప్పదని మన ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చెప్పేవారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఆయన హయాంలోనే గట్టి పునాది పడింది. ఆ తర్వాత ప్రధానమంత్రులుగా పనిచేసిన వారందరూ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలకు, నూతన ఆవిష్కరణలకు ఎంతగానో తోడ్పాటును అందించారు. దేశంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి సాధించడం, ప్రకృతి వైపరీత్యాల్లో సమర్ధవంతంగా సహాయక చర్యలు, పారిశ్రామిక ప్రగతి, మహిళా సాధికారత, సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగం వంటి అనేక అంశాలపై దృష్టి సారించిన భారత్ గణనీయమైన అభివృద్ధిని సాధించనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రపంచంలోనే ప్రబల ఆర్థిక శక్తిగా భారత్ అవతరించింది.
కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికతను వినియోగించాల్సిన అవసరం ఉంది. గనుక విద్యార్థుల్లో శాస్ర్తియ దృక్పథం పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవలసి ఉంది. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయం స్థాయి వరకూ పరిశోధనలు, ఆవిష్కరణలకు సరైన మార్గదర్శకాలను పాలకులు రూపొందించాలి. గ్రామసీమలు స్వయం సమృద్ధి సాధించేలా సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలి. పరిశోధనలపై ఆసక్తి చూపే యువతను అన్ని విధాలుగా ప్రోత్సహించాలి. కమ్యూనికేషన్ వ్యవస్థ శరవేగంగా మారుతున్న ప్రస్తుత కాలంలో సాంకేతిక విజ్ఞానాన్ని మారుమూల గ్రామాలకు సైతం అందించాలి. శాస్త్ర, సాంకేతికత రంగాలకు అధికంగా నిధులను కేటాయించాలి. శాస్తవ్రేత్తలను ప్రోత్సహించేందుకు, మేధోవలసలను నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. విద్యారంగానికి తగిన ప్రోత్సాహం ఉన్నపుడే నూతన ఆవిష్కరణలకు అవకాశం ఉంటుంది. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ఉత్పత్తులను పెంచేందుకు, మానవ వనరులను సద్వినియోగం చేసుకునేందుకు సాంకేతికతను అందుబాటులోకి తేవాలి.

-సంపతి రమేష్ మహారాజ్ 99595 56367