Others

ఆపన్న హస్తం.. ‘రెడ్‌క్రాస్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవతా విలువల్ని పెంపొందిస్తూ, శాంతి సందేశం అందించే అతి పెద్ద సేవా సంస్థ ‘రెడ్‌క్రాస్’. యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులకు ఆసరాగా ఉండేందుకు ఏర్పాటైన సంస్థే ‘రెడ్‌క్రాస్ సొసైటీ’. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సేవాసంస్థల్లో అతి పెద్దది. ఈ సంస్థను జీన్‌హెన్రీ డ్యూనాంట్ స్థాపించారు. 1895లో ఫ్రాంక్- సార్డియన్ కూటమికి, ఆస్ట్రియా సామ్రాజ్యవాద దళాలకు మధ్య జరిగిన యుద్ధంలో దాదాపు 40 వేల మంది సైనికులు మరణించగా, వేలాది మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు సేవలందించేందుకు అప్పట్లో స్లిట్జర్లాండ్‌కు చెందిన హెన్రీడునాంట్ ముందుకొచ్చాడు. ఆపన్నులను ఆదుకొనేందుకు ఓ సేవా సంస్థను ఎందుకు స్థాపించకూడదని ఆయన ఆలోచించాడు. అతని ఆలోచనల ఫలితంగా రెడ్‌క్రాస్ ఇంటర్నేషనల్ సొసైటీ ఆవిర్భవించింది. మే 8, 1812న జన్మించిన హెన్రీ డ్యూనెంట్ గౌరవార్థం ఏటా ఆయన జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా రెడ్‌క్రాస్ దినోత్సవం పాటిస్తున్నారు. 1901లో డునాంట్‌కు నోబెల్ బహుమతి లభించింది. స్విట్జర్లాండ్ జాతీయ జెండాలోని ఎర్రని బ్యాక్‌గ్రౌండ్‌లో తెల్లని క్రాస్ ఉంటుంది. దానిని తారుమారుచేసి తెల్లని బ్యాక్‌డ్రాప్‌లో ఎర్రని ‘క్రాస్’ను ఈ సంస్థ చిహ్నం (లోగో)గా తీర్చిదిద్దారు. రెడ్‌క్రాస్ ఇప్పటి వరకు మూడుసార్లు నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకుంది. 1920లో భారత్‌లో రెడ్‌క్రాస్ సొసైటీ ఏర్పాటైంది. దీని ప్రధాన కేంద్రం ఢిల్లీలో ఉంది. రెడ్‌క్రాస్ సంస్థలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్, జూనియర్ రెడ్‌క్రాస్, యూత్ రెడ్‌క్రాస్, రక్తనిధి కేంద్రం వంటి విభాగాలున్నాయి. ఈ సంస్థ ఏర్పాటు మానవీయ కోణం, నిష్పాక్షికత, సమతుల్యత, స్వతంత్రం, స్వచ్ఛంద సేవ, సేవా ఐక్యత, విశ్వజనయుత అనే ఏడు సూత్రాలపై పనిచేస్తుంది. ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9.7 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. మానవతావాదంతో ప్రపంచ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఈ సంస్థ సభ్యులు అనునిత్యం శ్రమిస్తూ ఉంటారు. జాతి, మత, కుల, వర్ణ, వర్గ, వయోభేదం లేకుండా పనిచేస్తారు. తొలి రోజుల్లో యుద్ధాల్లో గాయపడిన సైనికులకు సేవ చేయడానికి మాత్రమే ఇది పరిమితమై ఉండేది. ప్రథమ చికిత్స, నర్సులకు శిక్షణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందికి శిక్షణ, వైద్యశాలలను స్థాపించడం, రక్తనిధులు సేకరించడం మొదలైన పనులను ఈ సంస్థ చేస్తుంటుంది. అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీని 1863లో స్థాపించారు. దీని ప్రధాన కేంద్రం జెనీవా నగరంలో ఉంది. 1864లో రెడ్‌క్రాస్ సంస్థను స్థాపించేందుకు 14 దేశాలు అంగీకారం తెలిపాయి. అంతర్జాతీయ రెడ్‌క్రాస్, రెడ్‌క్రెసెంట్ సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌ఆర్‌సి) 1919లో స్థాపించబడింది. దీని ప్రధాన కేంద్రం కూడా జెనీవాలో ఉంది. రెడ్‌క్రాస్ చిహ్నాన్ని 1864 జెనీవా సదస్సు తర్వాత ప్రాచుర్యంలోకి తెచ్చారు. యుద్ధఖైదీలను అప్పగించే సమయంలో కూడా రెడ్‌క్రాస్ విధులను నిర్వహిస్తోంది. ఇటీవల మన వైమానిక దళానికి చెందిన అభినందన్‌ను పాకిస్తాన్ అధికారులు భారత్‌కు అప్పగించే సమయంలో కూడా ఈ సంస్థ చక్కటి పాత్రను నిర్వహించింది. తొలిసారిగా 1948లో రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఐదుగురితో ప్రారంభమైన రెడ్‌క్రాస్ ప్రస్తుతం 186 దేశాల్లో విస్తరించింది. ఇందులో సుమారు లక్ష మంది ఉద్యోగస్థులు, 120 మిలియన్‌కు పైగా వాలంటీర్లు ఉన్నారు.
భారత్‌లో 700 పైగా రెడ్‌క్రాస్ శాఖలు విస్తరించి ఉన్నాయి. జూనియన్ రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఆరోగ్యరక్షణ, ప్రథమ చికిత్సపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. రక్తదాన శిబిరాలను ప్రోత్సహించడంలో యూత్ రెడ్‌క్రాస్ సభ్యులు ముందుంటున్నారు. జనరిక్ మందుల దుకాణాల నిర్వహణను కూడా చేపడుతున్నారు. రక్తదాన శిబిరాలు నిర్వహించి, అత్యవసర పరిస్థితుల్లో రోగులకు సహాయం అందచేస్తారు.
*
నేడు ‘రెడ్‌క్రాస్ డే’
*

-కె.రామ్మోహన్‌రావు