Others

అంతకన్నా ఖరీదైన ‘దుస్తు’ లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా లెజెండ్ మారిలిన్ మన్రో గతించి 54 సంవత్సరాలు అయింది. (ఆగస్టు 5)
1955లో రిలీజ్ అయింది బిల్లి వైల్డర్ డైరెక్ట్ చేసిన మారిలిన్ మన్రో సినిమా - ‘సెవెన్ ఇయర్స్ ఇచ్’. అందులో మారిలిన్ మన్రో ధరించిన బుట్టగౌను, రైలు బండీ ఆమె ప్రక్కనుంచి దూసుకుపోయిన గాలికి గొడుగులా ఎగిరిన దృశ్యం. యుగయుగాలు జగాలను ఊగించిన, ఉర్రూగించిన సాముదాయకపు వలపు పంపిణీకి నమస్తే అన్నట్లు- ప్రేక్షక ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్య సమ్మోహ చకితుల్ని చేస్తూనే వస్తోంది. అరవై ఏళ్లయింది- ఈ సినిమా స్కోపు సినిమాలో మారిలిన్ మన్రో సౌందర్యం, నటనా కూడా టాప్. ఆమె ధరించిన, ఆ సినిమాలోని గౌను పోస్టర్ ప్రపంచం మొత్తంమీద ఎక్కువ కాపీలు గోడకెక్కిందంటారు. అదో రికార్డు. ఆ మారిలిన్ డ్రస్సును వేలం వేశారు. దానికి ట్వంటీయత్ సెంచురీ సినిమా ఇండస్ట్రీ ఐకాన్‌గా- ఒక ప్రతీకగా చాలా కీర్తి వుంది కనుక- ముప్ఫయి నలభై లక్షల డాలర్ల మధ్య ధర పలుకుతుందీ అనుకున్నారు గానీ, దానికి ఏభై ఆరు లక్షల డాలర్‌ల రేటు పలికింది! దీనికన్నా మించిన రేటు యింతవరకూ లేదుగానీ- అదే మారిలిన్ మన్రో సెక్సు సింబల్‌గా మహానటిగా కూడా పేర్గాంచిన గ్రేట్ మన్రోకి నిజ జీవితం అంతా కష్టాల పొట్లమే అయింది. తాను అద్దెకుంటున్న యింటద్దె కట్టలేక- ఇంటిగలాయన పీకలమీద కూర్చుంటే- 1949లో ఆమె తెగించి ‘గోల్డెన్ డ్రీమ్స్’ క్యాలెండర్‌కి నగ్నంగా ఫోజు యిచ్చింది. దొరికిన పారితోషికం యాభై డాలర్లు మాత్రమే. ఇవాళ ఆమె పోస్టర్ కావాలంటే వందల డాలర్‌లు పెట్టాలి!