Others

డాక్టర్ చక్రవర్తి (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడూరి కౌసల్యాదేవి రాసిన ‘చక్రభ్రమణం’ నవల ఆధారంగా దిగ్గజ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించిన సినిమా -డాక్టర్ చక్రవర్తి. 1964 జూలైలో స్క్రీన్స్‌కు వచ్చిన సినిమా గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా తనివి తీరదు. అంతేకాదు, వర్థమాన దర్శకులకు పెద్ద బాలశిక్షగా చెప్పుకునే చిత్రాల్లో డాక్టర్ చక్రవర్తికీ ప్రాధాన్యత కలిగిన స్థానం ఉంటుంది. అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై ఏఎన్నార్, సావిత్రి, షావుకారు జానకి, జగ్గయ్య ప్రధాన పాత్రధారులుగా నిర్మాత డి మధుసూదనరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. చక్రవర్తి (అక్కినేని) విదేశాల్లో చదువులు ముగించి స్వదేశానికి వస్తాడు. అతని ప్రేయసి శ్రీదేవి (కృష్ణకుమారి). వృత్తిరీత్యా ఇద్దరూ వైద్యులు. అక్కినేనికి పినతల్లి కూతురు సుధ (గీతాంజలి) చెల్లెలు. చెల్లెలంటే చక్రవర్తికి ప్రాణం. కాని సుధ కేన్సర్‌తో మరణిస్తుంది. చెల్లెలి చివరి కోరిక మేరకు నిర్మల (షావుకారు జానకి)ను పెళ్లి చేసుకొంటాడు. చక్రవర్తికి ప్రియమిత్రుడు రవీంద్ర (జగ్గయ్య). వృత్తిరీత్యా ఇంజనీరు. రవీంద్ర, మాధవి (సావిత్రి)లది అన్యోన్య దాంపత్యం. చక్రవర్తి చెల్లెలు చనిపోయినది మొదలు అతను దిగులుపడి పరధ్యానంగా ఉంటుంటాడు. చక్రవర్తి చెల్లెలు మాదిరిగానే, రవీంద్ర భార్య మాధవికీ సంగీతం, లలిత కళలు, రచయిత్రిగా ప్రవేశం ఉండటంవల్ల ఆమెను తోబుట్టువుగా ఆరాధిస్తుంటాడు. చక్రవర్తి, మాధవిల సాన్నిహిత్యాన్ని అపార్థం చేసుకొని నిర్మల, భర్త చక్రవర్తితో గొడవలు పడుతుంది. నిర్మల ఇంట్లో పెద్దదిక్కుగా ఉండే కాంతమ్మ (సూర్యకాంతం), నిర్మలను ఒప్పించి మాధవితో చక్రవర్తికి అక్రమ సంబంధం ఉందని రవీంద్రకు ఉత్తరాలు రాయిస్తుంది. చక్రవర్తి, మాధవిల బంధాన్ని అపార్ధం చేసికొని రవీంద్ర రగిలిపోతాడు. మాధవిని అనుమానించి పుట్టింటికి పంపేస్తాడు. చక్రవర్తి, సావిత్రి అన్న ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ (గుమ్మడి) మిత్రులు. శ్రీధర్ తన చెల్లెలు సంసారం చక్కదిద్దాలని శతవిధాలుగా ప్రయత్నిస్తాడు. చివరకు అపార్ధాలు తొలగి వైరాగ్యంతో తిరిగి విదేశాలకు వెళ్లడానికి తయారౌతాడు చక్రవర్తి. కాని ప్రాణాపాయ స్థితిలో తన చెల్లెలు మాధవికి ఆపరేషన్ చేసి పునర్జన్మ ప్రసాదిస్తాడు. తిరిగి అందరూ ఒక్కటవ్వడంతో కథ సుఖాంతమవుతుంది. ఎవరికెవరూ తీసిపోని నటన, సాంకేతిక పనితనం ఈ చిత్రంలో కనిపిస్తాయ. ఎస్ రాజేశ్వరరావు స్వరపర్చిన ‘నీవులేక వీణ’, ‘మనసున మనసై’, ఈ వౌనం ఈ బిడియం’ పాటలు ఈనాటికీ నిత్యనూతనాలు. అధఃపాతాళానికి జారుతోన్న ప్రస్తుత సినీ సాహిత్యానికి ఈ పాటలు పెద్ద బాలశిక్షే. అన్నపూర్ణ సంస్థ నిర్మించిన చిత్రాలలో ‘డాక్టర్ చక్రవర్తి’ అగ్రస్థానంలో నిలుస్తుంది.

-జిపి మల్లిక, తుని