Others

రత్తాలు.. రూటే వేరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐటెం సాంగ్స్‌తో రాయ్ లక్ష్మి తెలుగులో చాలా పాపులర్. మెగాస్టార్ చిరంజీవి ఖైది నెం 150లో రత్తాలు.. రత్తాలు అంటూ సాగే ప్రత్యేక గీతంలో నర్తించడంతో ఆమె సూపర్ పాపులర్ అయింది. ఇప్పటికీ చాలామంది ఆమెను రత్తాలు అని పిలుస్తారంటే ఆ పాట ఎంత క్రేజ్ తీసుకొచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఆమెపై రూమర్లు చాలా వస్తుంటాయి. రీసెంట్‌గా లక్ష్మీరాయ్ ఒక ఇంటర్వ్యూలో చాలా విషయాలు పంచుకుంది. ఈమధ్య మీరు నటించే తెలుగు సినిమాల సంఖ్య ఎందుకు తగ్గింది అని అడిగితే.. ఈమధ్య బాలీవుడ్ సినిమాలో నటించడం, ఇతర భాషలలో బిజీగా వుండడంతో అలా జరిగిందని చెప్పింది. బాలీవుడ్‌లో రాయ్‌లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన జూలీ 2 సినిమా నిరాశపర్చడంపై అడిగితే ‘‘నాకు వాళ్ళు చెప్పిన కథ వేరు.. సినిమాలో చూపించింది వేరు. నా పాత్రను వ్యాంప్‌లాగా చూపించడంతో కుటుంబ ప్రేక్షకులు దూరమయ్యారు’’ అని తెలిపింది. మీరు పూర్తి స్థాయి హీరోయిన్ పాత్రల్లో నటించడం కంటే స్పెషల్ పాటల్లో నటించేందుకు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని అడిగితే, సినిమాల్లో హీరోయిన్‌గా నటించి రెండున్నర గంటలు కన్పించినా ఒక్కోసారి క్రేజ్ రాజదు. కానీ అదే స్పెషల్ సాంగ్‌లో జస్‌ట ఐదు నిముషాలు కనిపిస్తే వస్తుందని.. అంతేకాకుండా ఎక్కువ రెమ్యూనరేషన్ కూడా లభిస్తుందని.. అందుకే వాటిని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుదంని తెలిపింది. నా జీవితంలో ఎఫైర్లకు స్థానం లేదు. గతంలో నేను మూడుసార్లు ప్రేమ విషయంలో మోసపోయాను. ఇపుడు అలాంటి రిలేషన్స్ కట్ చేశానని తెలిపింది రత్తాలు.