Others

జయలలిత పాత్రలో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథతో మూడు నాలుగు బయోపిక్స్ తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే మూడు సినిమాలు సెట్స్‌పై ఉండగా, తాజాగా మరో సినిమాను తెరకెక్కించే సన్నాహాలు మొదలయ్యాయి. ఈ కొత్త ప్రాజెక్టులో జయలలిత పాత్రలో నటించేది ఎవరోకాదు బాలీవుడ్ మాజీ హీరోయిన్ కాజోల్? తెలుగు నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఈ సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు మొదలుపెట్టాడు. తాజాగా ఆయన కాజోల్‌ని జయలలిత పాత్రకోసం ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక వ్యక్తిపై ఒకేసారి నాలుగు బయోపిక్ సినిమాలు తెరకెక్కడం నిజంగా సంచలనమనే చెప్పాలి. దక్షిణాదిలో హీరోయిన్‌గా ప్రవేశించిన జయలలిత ఆ తరువాత స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుని ప్రముఖ నటుడు ఎంజీఆర్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి ఆ పార్టీకి తిరుగులేని నాయకురాలిగా మారింది. అటుపై పలుమార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా సేవలు చేసి ప్రజలచే అమ్మ అని పిలిపించుకుంది. జయలలిత జీవితకథ నిజంగా అందరికీ స్ఫూర్తి. అందుకే ఆమె బయోపిక్‌పై అందరికీ ఆసక్తి. ఇప్పటికే ఐరన్ లెడీ పేరుతో ఓ సినిమా, ప్రముఖ దర్శకుడు ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న మరో సినిమా, ఇలా ఒకేసారి ఒకే వ్యక్తి కథతో నాలుగు బయోపిక్‌లు తెరమీదికొస్తున్నాయి. మరి జయలలిత పాత్రలో నటించేందుకు కాజల్ ఓకే చెబుతుందా లేదా చూడాలి.