Others

బావుల మొనగాడు మునియప్ప!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగుళూరు శివారులో ఓ వడ్డెర పాలెం వుంది. అరవై అయిదు కుటుంబాలుంటాయి. వాళ్ల నాయకుడు మునియప్ప (65) బావులు త్రవ్వడంలో మొనగాడు. బంగులూరులోనూ, మైసూరులోనూ కనీసం రెండు వేల బావులయినా త్రవ్వి వుంటాడు. కానీ తన గుట్టమీది గ్రామంలో తాగటానికి మంచినీళ్లు యిచ్చే బావి త్రవ్వలేకపోయాడు. పంచాయితీ దయాధర్మ భిక్ష అంతే.
ప్రొద్దునే్న లేస్తారు రుూ వడ్డెరలు. తమ గ్రామంలో ఎక్కడ త్రవ్వినా నీటి చుక్క పడదు అని తెల్సును గానీ వోసారి ఆశగా పరిసరాలను చూసుకుని పట్నంవేపు- డబ్బా డవాళా పట్టుకుని సాగుతారు. ‘‘బావులు త్రవ్వుతాం.. బావిలో పూడికలు తీస్తాం’’ అంటూ నలుగురూ, నాలుగు దిశలా అరచుకుంటూ, తిరుగుతూ పోతారు. అవకాశం దొరికిందా ఓ వెయ్యి లేదా పదిహేను వందలు పూడికకీ, లేదా ఐదు వేలు బావి త్రవ్వకానికీ- అంతవరకే దక్కుతాయి. ముప్ఫయి అడుగులు దిగితే కానీ- నలభై ఎనిమిది గంటల తర్వాత గానీ నీటి ఊట (జల) దొరకదు.
మునియప్పకి తన గ్రామంలో ‘నీటిచుక్క’ త్రవ్వలేకపోయామే? నన్న చింత నిరంతరం వేధిస్తోంది. వానలు పడితే, నీళ్లు వరదలాగా జారుతాయి. అతనికో ఐడియా వచ్చింది. తనకు గ్రామంలో ఒక పొడిబావి త్రవ్వాడు. అంటే ‘ఇంకుడు గుంట’ అన్నమాట. దానిలోకి వర్షం నీళ్లు చేర్చుకుంటారు అంతా చేరి పిల్లా, పాపా అంతా కలిసి. చిన్ని చిన్ని చెరువులు అనుకోండి- అవి త్రవ్వి పెడతారు రెడీగా. ఆనక ఆకాశంలోకి చూస్తారు- వానలకోసం పగలూ రాత్రీ.
ఎక్కడ నీళ్లు పడతాయో వాళ్లకి తెల్సు. వాళ్ల కుగ్రామంలో మాత్రం ఎక్కడా పడవని తెల్సు. ఐతే, మునియప్ప పొడి ఇంకుడు గుంటల అయిడియా మాత్రం గ్రామవాసులకి శిరోధార్యం!

-వీరాజీ