Others

కలగా మిగిలిపోయిన కార్మికుల భాగస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్మికుడు అంటే కష్టపడి పనిచేసే వ్యక్తిగా,కూలిపని చేసే వ్యక్తిగా పరిగణించాలి. అనాదిగా సమాజంలో ఆర్థిక అసమానత్వం ఉండడంతో అప్పటి నుంచీ ఇప్పటి వరకు కార్మిక వ్యవస్థ కొనసాగుతూనే ఉంది. కార్మికులు లేకుంటే అభివృద్ధి అనేది లేదు. ఇంకా చెప్పాలంటే.. సూర్యుడు లేకున్నా కొన్ని గంటలు చీకటిలో మగ్గవచ్చునేమో కానీ... కార్మికులు లేకుంటే ఒక గంట కూడా ముందుకు సాగడానికి అవకాశం వుండదు. రోజులు మారుతున్నాయి. సమాజం ఎంతో వేగవంతంగా ముందుకెళుతున్నది. సాంకేతిక ఫలాలు అందరి చేతుల్లోకి వచ్చాయి. అయినా సమసమాజ స్థాపన అనేది ఎండమావిగానే మిగిలిపోతున్నది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో నెలకొన్న పాలకపక్షాల పక్షపాత వైఖరి వల్ల కార్మికులు కార్మికులుగా, యజమానులు యజమానులుగా మిగిలిపోతున్నారు. కార్మికుల భాగస్వామ్యం అనేది కలగానే మిగిలిపోతున్నది. కార్మిక శ్రేయస్సు, వారి భాగస్వామ్యం కోసం ఎన్ని చట్టాలు వచ్చినా ప్రయోజనం శూన్యం. ‘కార్మికుల బానిసత్వం- యజమానుల రాజరికం’ యథాతథంగా వర్ధిల్లుతూనే వున్నది.
నేడు ప్రపంచాన్ని మూడు ఆర్థిక వ్యవస్థలు నడిపిస్తున్నాయి. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేవి కనిపిస్తున్నాయి. అమెరికా లాంటి అగ్రరాజ్యాలు పెట్టుబడిదారీ ఆర్థిక విధానాలను అవలంబిస్తున్నాయి. చైనా వంటి దేశాల్లో సామ్యవాద ఆర్థిక వ్యవస్థ విధానాలు అమలులో వున్నాయి. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ఈ రెండు ఆర్థిక వ్యవస్థల్లోని మంచిని గ్రహించి మిశ్రమ ఆర్థిక వ్యవస్థను మన నేతలు అమలు చేస్తున్నారు. ఆచరణలో అడుగడుగునా సామ్యవాద ఆర్థిక వ్యవస్థ విధానాలు లోపించి, పూర్తిగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ విధానాలను అవలంబిస్తున్న దుస్థితి నెలకొంది. మన మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ధనవంతుడు మరింత ధనవంతునిగా ఎదుగుతున్నాడు. పేదవాడు మరింత పేదవాడిగానే కుంగిపోతున్నాడు. ఈ నేపథ్యంలో కార్మికుడు అప్పుల్లో పుట్టి, అప్పుల్లో పెరిగి, అప్పులతోనే మరణిస్తున్నాడని చెప్పవచ్చు. ప్రపంచంలోని ఎనిమిది వందల కోట్ల జనాభాలో కనీస అవసరాలకు నోచుకోని కార్మికులు రెండువందల కోట్ల మంది ఉన్నారు. మన దేశంలో 130 కోట్ల జనాభాలో ఇలాంటి కార్మికులు 40 కోట్ల మంది వున్నారు.
అసంఘటిత కార్మికుల సంక్షేమానికి ఎన్డీయే ప్రభుత్వం కొన్ని సౌకర్యాలను తీసుకొచ్చింది. ఇళ్లలో పనిచేసే ఆయాలకు రూ.7000, కిరాణా షాపులలో పనిచేసే గుమాస్తాలకు రూ.8000 కనీస జీతం ఉండేలా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. కార్మికులందరికీ సంబంధిత యాజమాన్యాలు పీఎఫ్., ఇఎస్‌ఐ చెల్లించాలి. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కూడా పటిష్టమైన చట్టాలు వచ్చాయి. మహిళా కార్మికుల సంరక్షణకు అనేక చట్టాలు రూపొందించారు. ఆచరణలో ఇవేవీ కనిపించడం లేదు. పాలక పక్షాలను ఆడిస్తున్నదీ, శాసిస్తున్నదీ.. బడా పారిశ్రామికవేత్తలు, నల్లకుబేరులు అయినందున ఆ చట్టాలు చట్టుబండలుగా మారాయి. కొంతలో కొంతైనా చైనా లాంటి దేశాలలో సామ్యవాద ఆర్థిక వ్యవస్థ విధానాలలో భాగంగా కార్మికులకు అనేక సౌకర్యాలు కల్పించారు. యాజమాన్యాల లాభాల్లో కొంతైనా భాగస్వామ్యం ఏర్పడింది.
కార్మికులకు పూర్తిగా భాగస్వామ్యం ఏర్పడాలంటే సహకార వ్యవస్థలో కర్మాగారాలు ఏర్పడాలి. ఇలాంటివి మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో విజయవంతంగా నడుస్తుండగా, ఇటీవల గుజరాత్ కూడా చాలావరకు పుంజుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అనేక సహకార కర్మాగారాలు పాలకుల వైఫల్యాల వల్ల మూతపడ్డాయి. అనంతపురం జిల్లా గుంతకల్లులో 1990-91లో మూతపడిన స్పిన్నింగ్‌మిల్, తెలుగు రాష్ట్రాల్లో మూతపడిన విజయ ఆయిల్ మిల్లులు, తెలంగాణలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని షుగర్ ఫ్యాక్టరీలు, చిత్తూరు విజయ డెయిరీ, విజయనగరం జిల్లాలో కొన్ని జూట్ మిల్లులు మూతపడ్డాయి. సహకార వ్యవస్థలోనే కార్మికుల భాగస్వామ్యం మూడుపువ్వులు- ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది.

-తిప్పినేని రామదాసప్పనాయుడు 99898 18212