Others

నందమూరి సోదరులకు షాక్! ( ఆనాటి హృదయాల..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేషనల్ ఆర్ట్ థియేటర్స్ (యన్‌ఏటి) బ్యానరు ప్రొడక్షను వ్యవహారాలు చాలా స్ట్రిక్టుగా ఉండేవి. షెడ్యూలు, కాల్షీటు, షూటింగు, ట్రాన్సుపోర్టు, ఆతిథ్యం అన్ని విషయాల్లోనూ వారికో పద్ధతుంటుంది. ఆ ప్రకారం అందరూ అనుసరించాల్సిందే!
యన్‌టిఆర్‌ని పెద్దాయనగానూ, త్రివిక్రమరావుని చిన్నాయనగానూ పిలుచుకుంటారు. ఈ సోదరులమధ్య మంచి అవగాహన వుంది. ఏదైనా వ్యవహారం గురించి చిన్నాయన్ని అడిగితే.. అచ్చా! (ఊతపదం) పెద్దాయన్ని అడిగి చెప్తాను అనే వారు. అలాగే పెద్దాయన్ని అడిగితే... అచ్చా! చిన్నాయన్ని అడిగి చూడండి అంటారు. వారిమధ్య చక్కని అండర్‌స్టాండింగ్ వుంది. ఒకరికి తెలియకుండా మరొకరు ఏ పనీ చేసేవారు కాదు. ప్రొడక్షనులో అనవసర ఖర్చు రూపాయి పెరిగినా ఒకరికొకరు లెఖ్ఖ చెప్పుకోవలసిందే!
‘దానవీర శూరకర్ణ’ చిత్రం ఆఘమేఘాల మీద ప్రారంభమైందన్న విషయం తెలిసిందేగదా. ఒకపక్క పద్మాలయావాళ్లు మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించేశారు కురుక్షేత్రం చిత్రానికిగాను. యన్‌ఏటీ కూడా పోటీగా ప్రొడక్షను చెయ్యాలికదా- మ్యూజిక్ సిటింగ్స్ ప్రారంభించారు. యస్ రాజేశ్వరరావు ప్రతిరోజూ టాక్సీలో రావడం వెళ్లడం, ఇందుకుగాను నాలుగువందల రూపాయల ఖర్చు కనిపిస్తోంది. అదే ఆటోలో వస్తే రెండు వందలతో సరిపోతుంది. ఈ విషయమై అన్నదమ్ముల మధ్య ఏంచర్చ జరిగిందో ఏమోగాని.. మ్యూజిక్ సిటింగ్స్ అయ్యాక ఇంటికి వెళ్తున్న రాజేశ్వరరావుతో చిన్నాయన ఇలా చెప్పేడు.
‘అయ్యా! రాజేశ్వరరావుగారూ! మీరు పెద్దవాళ్లు. మీకు చెప్పేపాటివాడ్ని గాను. మీరు మ్యూజిక్ సిటింగ్స్‌కి ఆటోలోవస్తే రోజుకి నూరూ, నూటాయాభైతో సరిపోతుంది. కానీ టాక్సీలో వస్తున్నారు. రోజుకి నాలుగువందలు ఖర్చవుతుంది. అవసరమైతే ఖర్చుపెట్టచ్చు. కానీ, ఇలా డబ్బు వృధా చేయడం మంచిదికాదుకదా. రేపు ఆటోలో రండి!’ అన్నారు.
మరుసటిరోజు మ్యూజిక్ సిటింగ్స్ అద్భుతంగా జరిగిపోయాయి. చిన్నాయనకు పాటలపిచ్చి. మ్యూజిక్ సిటింగ్స్ జరుగుతుంటే పసిపిల్లాడిలా కేరింతలు కొడతారు. సరే.. ఎవరిళ్ళకు వారు వెళ్తున్నారు. రాజేశ్వరరావుగారికి వెయ్యి రూపాయలు కావాలంటున్నారు!’ అన్నాడు ప్రొడక్షను మేనేజరు.
‘వెయ్యి రూపాయలేవిటీ. ఆయన టాక్సీలో వస్తే మనమిచ్చేది వెయ్యి రూపాయలు కాదుకదా. నాలుగువందలేగా?’ అడిగారు చిన్నాయన.
‘ఏమో సర్. ఆయనడిగారు. వారితో మాట్లాడండి!’ సవినయంగా పక్కకు తప్పుకున్నాడు మేనేజరు.
ఇంతలో రాజేశ్వరరావు వచ్చారు. ‘ఏవిట్సార్... మీరు నా గురించే ఏదో మాట్లాడుకుంటున్నారు.. ఏవిటి విషయం?’ ఏమీ తెలియనట్లడిగారు.
‘మీరు టాక్సీలో వస్తే నాలుగువందలే కదా అయ్యేది. మరి వెయ్యి రూపాయలంటున్నారేవిటీ ఈ మేనేజరు కొత్తగా’
‘మేనేజరుకి వివరంగా చెప్పానండీ. అర్ధమైనట్లు లేదు. మీకు చెబుతాను వినండి. మీరు నన్ను ఆటోలో రమ్మన్నారు. ఔనా?. నేను బయలుదేరేసరికి రోడ్డుమీద ఒక్క ఆటోకూడా లేదు. పోనీ టాక్సీలో వచ్చేద్దామంటే మీదేమో సుగ్రీవాజ్ఞాయె. అందుకని ఆటోకోసం టాక్సీలో బయలుదేరాను. ఆటో ఎక్కడ దొరికిందనుకొనేరు? శాంతోయ్ బీచ్ దగ్గర దొరికింది. అక్కడ్నించి ఆటోలో వచ్చాను. మరి టాక్సీకి డబ్బులివ్వాలి కదాండీ! ఈ ఆటోవాడి దగ్గర డబ్బులు తీసుకొని టాక్సీవాడికిచ్చి పంపించేశాను. తిరిగి నేను ఆటోలో వెళ్లాలంటే ఆటో కావాలికదండీ. ముందుచూపుతో మీకు ఇబ్బందిలేకుండా ఆటో అట్టేపెట్టాను. ఇల్లు చేరేసరికి వాడికివ్వాల్సిన మొత్తం వెయ్యి రూపాయలు అవుతుందంటున్నాడు. ఆ వెయ్యి రూపాయలు ఎక్కడ్నించితేనూ? అయ్యా.. ఇదీ విషయం! అటుపైన తమ దయ, మా ప్రాప్తం!’అన్నాడు జోవియల్‌గా.
ఈ మాటలు విన్న త్రివిక్రమరావుకి అంత సీరియస్‌నెస్‌లోనూ ఫక్కుమంటూ నవ్వుతన్నుకొచ్చింది. ఇది విన్న పెద్దాయన పసిపిల్లాడిలా పడిపడీ మరీ నవ్వారు.
‘రాజేశ్వరరావుగారూ! మీరు పండితులు. మిమ్మల్ని డబ్బుల్తో కొలవలేం. మీరు దర్జాగా తాంబూలం వేసుకొని మరీ టాక్సీలో రండి. ఒక వంద రూపాయలు ఎక్కువే తీసుకోండి!’ అంటూ పెద్దాయన రిక్వెస్ట్ చేశాడు. ‘అంతమాటనకండి. మనందరం ఒకటే. కళామతల్లిని నమ్ముకున్నవాళ్లం. ఒకళ్లనొకళ్లం అర్థం చేసుకుపోవాలి! ఇక శెలవు! అంటూ టాక్సీ ఎక్కేశాడు రాజేశ్వరరావు.

-ఇమంది రామారావు 9010133844