Others

హిందూ, బౌద్ధం వేర్వేరు ధర్మాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనాతన హిందూ ధర్మం లేకపోతే బౌద్ధ్ధర్మం లేదు. బౌద్ధం లేకపోయినా హిందూ ధర్మం కొనసాగుతుంది. ఈ సూక్ష్మ పరిశీలనను పూర్తిగా అవగాహన చేసుకుంటే వాస్తవం బోధపడుతుంది. దేశంలో హిందూ-బౌద్ధ్ధర్మాలు పరస్పరం సంఘర్షించుకుంటాయని, ద్వేషించుకుంటాయని చాలామంది అనుకుంటారు. ఆ వాతావరణాన్ని కొందరు తరచూ సృష్టించేందుకు ఆయాసపడుతూ ఉంటారు. కాని రెండు ధర్మాల మధ్య ఎలాంటి ఘర్షణ- ద్వేషభావం లేదని ప్రముఖ పురావస్తువేత్త, సంస్కృత పండితుడు, లలిత కళల్లో అపార పరిశోధనలు చేసిన తమిళనాడుకు చెందిన డాక్టర్ ఆర్.నాగస్వామి అంటున్నారు. అందుకు సంబంధించి ఆధారాలు చూపుతున్నారు. వాస్తవాల్ని వివిధ సదస్సుల్లో చెబుతున్నారు. ఆ తిరుగులేని సాక్ష్యాల ఆధారంగానైనా కొందరు ‘కుహనా’ బౌద్ధ్ధర్మ ప్రేమికులు ద్వేషాన్ని గాక ‘‘సమ్యక్ దృష్టి’’ని అలవరచుకుంటారని ఆశిద్దాం.
భారత్‌లోని, ఇతర దేశాల్లోని బౌద్ధ ప్రార్థనా మందిరాల్లో హిందూ దేవతలను ఆరాధిస్తారు. మన దేశం నుంచి శ్రీలంక, ఆగ్నేయాసియా దేశాలకు విస్తరించిన బౌద్ధ్ధర్మం దేవాలయాల్లో, ఆరామాల్లో, చైత్యాలలో అనేక హిందూ ధర్మ దేవతామూర్తులు ఉన్నాయన్న మాట ‘ఇక్కడి’ బుద్ధ ప్రేమికుల గొంతు దిగకపోవచ్చు. కాని వాస్తవం కాస్త అవాస్తవమవదు కదా!
అంతెందుకు..? బౌద్ధాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన అశోకుడు హిందూ ధర్మాన్ని వ్యతిరేకించాడని, ద్వేషించాడని కొందరు తమని తాము సంతోషపరచుకోవడానికి ప్రచారం చేస్తుంటారు. కాని అశోకుడు ఏర్పాటు చేసిన ఏ ‘శాసనం’లో గాని, మరోచోట గాని ఆయన హిందూ ధర్మ వ్యతిరేకతను ప్రదర్శించలేదు. పైగా హిందూ ధర్మ ప్రతినిధులుగా భావించే బ్రాహ్మణులను ఆయన గౌరవించినంతగా మరొకరు గౌరవించలేదన్న సాక్ష్యాలు కోకొల్లలని నాగస్వామి రుజువులు చూపిస్తున్నారు. ధర్మంపై ఎప్పుడైనా ఏదైనా శంక కలిగితే, అనుమానం వస్తే బ్రాహ్మణులను సంప్రదించమని స్వయంగా అశోకుడే పేర్కొన్నాడు. ‘్ధర్మపద’లో ‘సమదర్శన’ అని వుంటుంది తప్ప బ్రాహ్మణ వ్యతిరేకత వీసమెత్తు కనిపించదు. అప్పటి వైశాలి, మగధ మరికొన్ని రాజ్యాల్లో బౌద్ధ ధర్మాన్ని ఆదరించిన రాజులు బ్రాహ్మణులకు బహుమతులు అందజేశారు. వారి బాగోగులు చూశారు. ఆ జ్ఞానాన్ని కాపాడారు. తదనుగుణమైన చర్యలు తీసుకున్నారు.
అయితే, రొమిలా థాపర్ లాంటి రచయిత్రులు/ రచయితలు భారతదేశ చరిత్రను తప్పుగా (వక్రీకరించి) రాయడం, అదే నిజమని చాలామంది భావించి బౌద్ధానికి పెద్ద పీటవేసి, హిందూ ధర్మాన్ని చిన్నచూపు చూసేలా వాతావరణాన్ని కల్పించడం విషాదం. ఈ విషయాన్ని డాక్టర్ నాగస్వామి ఎంతో ప్రతిభావంతంగా ఆధారాలతో, సాక్ష్యాలతో చూపుతున్నారు. హిందూ ధర్మంలో శైవులు- వైష్ణవులు ఉంటే అవి రెండు వేర్వేరు మతాలని భ్రమపడితే ఎలా? బహుళ దేవతార్చన విధానం గల హిందూ ధర్మంలో బుద్ధిజం కూడా అంతర్భాగమని ఆయన గట్టిగా వాదిస్తున్నారు. అందుకు అవసరమైన ఆధారాలు చూపుతున్నారు. తాత్విక భూమికతో ఆలోచించినా, ఎపిగ్రాఫికల్ భూమికతో యోచించినా ఇదే సత్యం అని ఆయన బల్లగుద్ది చెబుతున్నారు. ఇది సత్యం కాకపోతే కరడుగట్టిన బౌద్ధమత అవలంబికులున్న శ్రీలంకలో గాని, ఆగ్నేయాసియా దేశాలలోగాని బౌద్ధమందిరాలలో హిందూ దేవతల విగ్రహాలు- పటాలు, వాటి ప్రాముఖ్యత తెలిపే రాతలు ఉండేవి కావని అంటున్నారు.
అశోకుని కాలం నుంచి శ్రీలంకలో బౌద్ధం విరాజిల్లుతోంది. ఆ దేశ రాజధాని కొలంబోలో మహాయాన పద్ధతిలో బుద్ధుని ఆరాధించే దేవాలయం పేరు ‘గంగారామ్’. అందులో అనేక హిందూ దేవతల పటాలు కనిపిస్తాయి. నారాయణుడితోపాటు లక్ష్మి కూడా కనిపిస్తుంది. బుద్ధునితో పాటు వీరిని కూడా బౌద్ధమత అవలంబికులు ప్రతినిత్యం ఆరాధిస్తారు. ఈ ‘సత్యం’ కొందరి చెవులకు వినసొంపుగా లేకపోయినా వాస్తవం మాత్రం అదే. హిందూ ధర్మంలో అంతర్భాగం బౌద్ధం అని చాటిచెప్పడానికి ఈ ఉదాహరణ సరిపోదనుకుంటే.. ఆగ్నేయాసియా దేశాలైన థాయిలాండ్, బర్మా, కాంబోడియా, వియత్నాం తదితర దేశాల్లో సైతం ఇంతకన్నా చిక్కగా హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నారు బౌద్ధులు. అక్కడ రామాయణాన్ని ఆరవ ప్రాణంగా చూసుకుంటారు. వారి సంస్కృతిలో రామాయణం పూర్తిగా అంతర్భాగం. రామాయణంలోని పేర్లనే తమ పిల్లలకు- ఈ 21వ శతాబ్దంలోనూ పెట్టుకుంటున్నారు.
థాయ్‌లాండ్‌లో బ్రాహ్మణ దేవాలయ అంతర్భాగంలో బౌద్ధ దేవాలయం ఉంది. ‘రామరాజ్యం’ అన్న పదం అక్కడి వారికి పరమ పవిత్రమైనది. అయోధ్య అన్న పేరును ఆరాధనా భావంతో ఇప్పటికీ పలుకుతారు. బుద్ధుడి దేవాలయంలో శివ, విష్ణు, బ్రహ్మలను పూజిస్తారు. కొన్నిచోట్ల ‘లింగం’ దర్శనమిస్తుంది. బౌద్ధం ప్రధానంగా గల థాయిలాండ్ ప్రజలు తమ రాజును అపారంగా ప్రేమిస్తారు. ఆయన అతి ప్రాచీన హిందూ లిఖిత ప్రతులను ప్రేమిస్తాడు. సంవత్సరంలో ఓ రోజు వాటిని పఠించే క్రతువును నిర్వహిస్తారు. అట్టహాసంగా, ఆర్భాటంతో ఆ ఉత్సవం కొనసాగుతుంది. ఆ రోజును ‘వేద వేదాంగతత్వజ్ఞ’ అని సంబోధిస్తారు. శివలింగాన్ని పూజిస్తారు.
కాంబోడియాలో బుద్ధుని బంగారు ప్రతిమలతో పాటు విష్ణు పాదాలను పూజిస్తారు. ఇక్కడ కూడా అనేక బ్రాహ్మణ దేవాలయాలు కనిపిస్తాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన అంకోవర్ దేవాలయ సముదాయం అపురూపమైనది. బౌద్ధ ధర్మం ప్రధాన మతంగా ఆచరిస్తున్న ఈ దేశాలలో, ఇస్లాం మతాన్ని ఆచరించే వారి సంఖ్య గణనీయంగా కనిపిస్తుంది. మలేషియా వంటి దేశాల్లోనూ హిందూ ధర్మం పట్ల అత్యంత భక్తి ప్రపత్తులు ప్రదర్శిస్తారు. ప్రజలే కాదు పాలకులు సైతం అంతే నిష్ఠను వ్యక్తపరుస్తారు.
మహాయాన బౌద్ధ ధర్మ ఆచరణలో తరతరాలుగా అనేక మంది హిందూ దేవతలను ఆరాధిస్తూనే ఉన్నారు. చివరకు ఇంద్రుడు, వరుణుడు, అగ్నిని ఆరాధిస్తారు. కోల్‌కతాలోని బుద్ధుని మహాపరినిర్వాణ విగ్రహంతోపాటు కార్తికేయుడు, గణేశుడు, దిగ్‌దేవతలను ఆరాధిస్తారు, పూజిస్తారు. కొన్నిచోట్ల నవదుర్గ విగ్రహాలు దర్శనమిస్తాయి. హిందూ దేవాలయ సంస్కృతిలో ప్రధాన దేవుని రూపంతోపాటు వెలుపల ఇతర దేవతల విగ్రహాలు గల చిన్న ఆలయాలు ఉన్నట్టుగానే ఆగ్నేయాసియా దేశాలన్నిటా బౌద్ధమందిరాలలో ఆ సంస్కృతిని, సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. బుద్ధునితోపాటు విష్ణువుని కొలుస్తున్నారు. వాస్తవానికి బుద్ధుని మహానిర్వాణ సమయంలో పడుకునే తీరు.. ఆ ముద్ర మహావిష్ణువు పడుకునే తీరు ఒకే విధంగా ఉండటం గమనార్హం. ఆ రకంగానూ హిందూ ధర్మంలో బౌద్ధం అంతర్భాగమని చెబుతారు.
అశ్వఘోశుడు రాసిన ‘బుద్ధ చరిత్ర’లోనూ నారాయణ (మహావిష్ణువు) పేరును పేర్కొన్నారు. ‘నిష్పణ్ణ యోగావళి’ అనే గ్రంథంలోనూ 21 చక్రాలను పూజించాలని చెప్పారు. ఆ చక్రాలలో కార్తికేయ, గణేశ, ఇంద్ర, వాయు తదితర దిగ్‌దేవతలుంటారు. కరడుకట్టిన బౌద్ధులే బౌద్ధం హిందూ ధర్మంలో అంతర్భాగమని అంగీకరిస్తూ, ఆరాధిస్తుంటే మిడిమిడి జ్ఞానంతో ఇక్కడ కొందరూ ఈ రెండు మతాల మధ్య ఘర్షణ ఉందని, ఉండాలని ఆశించడం అర్భకత్వమే అవుతుంది కదా?

-వుప్పల నరసింహం 99857 81799