Others

మాయాదేవికి మందిరమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాక్యవంశరాజు, కపిలవస్తు పాలకుడు శుద్ధోదనుడి భార్య, సిద్ధార్థుడి తల్లి మాయాదేవికి ‘లుంబిని’లో మహామందిరాన్ని నిర్మించారు. తరతరాలుగా ఆ మందిరానికి మెరుగులు దిద్దుతున్నారు. వర్తమానంలో ఆ మందిర వైభవం ఇంతా అంతా కాదు. విశాలమైన మందిరం లోపల పైకప్పుపై అపురూప చిత్రాలను చిత్రించారు. ‘గుమ్మటం’ లాంటి ఆకారమంతటా మాయాదేవి ప్రసవానికి ముందు- తరువాతి సన్నివేశాలను సృజించారు. ఆపైన తాంత్రిక ‘చక్రం’ ఒకటి చిత్రించారు. విచిత్రమేమిటంటే అక్కడ ఉన్నది బుద్ధుడి ప్రతిమనే.. పేరు మాత్రం మాయాదేవి మందిరం!
సిద్ధార్థుడు బుద్ధుడిగా రూపాంతరం చెందిన కారణంగా మాయాదేవి మహిమాన్వితురాలైందా? కేవలం ఒక బిడ్డకు జన్మనిచ్చి మరణించిన మహారాణికి మందిరమా? మాయాదేవి గొప్పదనం గాని, మహాత్మ్యం గాని, అద్భుతాలు కాని ఏవీ లేవు. అయినప్పటికీ ఆమెకు అద్భుతమైన అతి ఖరీదైన, విశాలమైన, కనసొంపైన మందిరం నిర్మించడం ప్రపంచ బౌద్ధమతస్తులు అందరూ తప్పకుండా ఆ స్థలాన్ని సందర్శించాలన్న ఓ నియమం పెట్టడం, ఆ ప్రాంతానికి, మందిరానికి గొప్ప పవిత్రతను ఆపాదించి ప్రవచనాలు చేయడం, బౌద్ధ సన్యాసులు మందిర పరిసరాల్లో అసంఖ్యాకంగా సంచరించడం దేనికి చిహ్నం?
బుద్ధుడు గొప్ప భౌతికవాది అని వాదించేవారే, గొప్ప ఆదర్శవాది అని చెప్పేవారే మాయాదేవి మందిరాన్ని తప్పక సందర్శించాలని చెప్పడం విడ్డూరం. మరి శుద్ధోదనుడు ఏం పాపం చేశాడు? ఆయన వల్లనే కదా సిద్ధార్థుడు జన్మించాడు, ఆయన వల్లనే కదా సిద్ధార్థుడు విద్యాబుద్ధులు నేర్చింది, ఆయన వల్లనే కదా దాదాపు మూడు కాలాలకు మూడు ప్రత్యేక ప్యాలెస్‌లలో వైభోగం అనుభవించింది. అపురూపంగా చూసుకున్నది ఆయనే కదా? తల్లి మాయాదేవి మరణించినా ఆ లోటు తెలియకుండా ‘గౌతమి’ చేతిలోపెట్టి పెద్దచేసింది ఆయనే కదా?... సిద్ధార్థుడిని ఈ ప్రపంచంలో ఎవరూ ప్రేమించనంతగా ప్రేమించి, అరికాలు కిందపెట్టకుండా అపురూపంగా పెంచి ఓ అందమైన రాచకన్య యశోధరను పెళ్లిచేసింది ఆయనే కదా? సంఘంలో తోటిరాజుల మధ్య తలెత్తుకుని తిరిగేలా, జీవించేలా చేసింది ఆయనేకదా? భూదేవంత పీట, ఆకాశమంత పందిరి వేసి వైభవంగా కల్యాణం చేసి ప్రపంచాన్ని పరిచయం చేసిందీ ఆయనే కదా? మరి అలాంటి రాజు ‘‘పితృస్వామ్య వ్యవస్థ’’ పేర ఛీత్కారానికి గురయ్యాడా? ఎందుకు ఆయనకూ మందిరం లేదు?
అవును ఎందుకు లేదు? అందరూ ఆలోచించాల్సిన విషయమే ఇది. కాని గత రెండున్నర వేల సంవత్సరాలుగా ఇదే నిర్లక్ష్యపు తంతు కొనసాగుతోంది. సహేతుకం కాని ఆరాధన కొనసాగుతోంది. లౌకిక ప్రపంచానికి, తర్కానికి తావులేని విధంగా చేసిన ప్రవచనాల ఆధారంగా ఓ మతాన్ని ముందుకు తీసుకొచ్చి దానికి మూలపురుషుడైన సిద్ధార్థుడి తల్లికి సైతం దివ్య-్భవ్య మందిరం నిర్మించి, అది పవిత్ర స్థలంగా ప్రచారం చేసి, ఖరీదైన ఆవరణంలో ఆరాధ్య వాతావరణం ఏర్పరచి తన్మయులవ్వాలని బోధచేస్తే.. అదీ 21వ శతాబ్దంలోనూ అంతే సాంద్రతతో అన్ని మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడం సమంజసమవుతుందా?
లుంబిని ఇప్పుడు నేపాల్ దేశంలో ఉంది. మాయాదేవి ‘కొలియన్’ రాచకుమార్తె. శుద్ధోదనుడితో వివాహమయ్యాక తొలి కాన్పు కోసం తన తల్లిగారింటికి వెళుతుండగా మార్గమధ్యంలోనే ప్రసవం జరిగిందని, ఆ ప్రాంతమే ‘లుంబిని’ అని చెబుతారు. నేపాల్‌లోని ఆ లుంబిని ప్రాంతంలో రెండున్నర వేల క్రితం సిద్ధార్థుడు జన్మించాడని భావిస్తున్నచోటును భద్రపరిచారు.
ప్రసవానికి పది నెలలముందు సిద్ధార్థుడు కడుపులో పడ్డప్పుడు మాయాదేవి ‘కల’గన్నదట. ఓ తెల్ల ఐరావతం (ఏనుగు) ఆరు తెల్లటి దంతాలతో తన గర్భంలోకి ప్రవేశించినట్టు స్వప్నించిందట. ఆ స్వప్నం కారణంగానే సిద్ధార్థుడు పది నెలల అనంతరం జన్మించాడని అందుకే తల్లి-బాలుడు.. ఇద్దరూ మహిమాన్వితులని బౌద్ధ‘్భక్తుల’ నమ్మకం, మాయాదేవి పురాణకాలం నాటి రాచవంశస్తురాలు కాదు. రెండున్నర వేల క్రితపు రాకుమార్తె. అప్పటికి తెల్ల ఏనుగులు, వాటికి ఆరు తెల్లదంతాలు ఉండటం ఓ కల్పన, ఊహమాత్రమే.. వాస్తవం కాదు. ఆరు దంతాలతో అద్భుత ఐరావతం ఓ అత్యద్భుత ‘కాల్పనిక సాహిత్యపు అంశం’ తప్ప మరొకటి కాదు.
ఇవన్నీ 21వ శతాబ్దపు మానవ మేధ నమ్మే విధంగా, విశ్వసించే విధంగా ‘ట్రాన్స్’లోకి పంపే భావజాలం వ్యాప్తిచేయడం- దాన్ని ‘ప్రమోట్’ చేయడం విచిత్రంగా తోస్తుంది. బుద్ధుడు భౌతికవాది, గొప్ప సంస్కర్త, విప్లవవాది, ‘అద్భుత జ్ఞానోదయం’ పొందిన వ్యక్తి అని ఓ పక్క చెబుతూ ఈ ధవళకాంతి ఏనుగు, ఆరు దంతాల ఐరావతం, స్వప్నం... సిద్ధార్థుని సమ్మోహన రూపం... ఇట్లా తార్కికతకు- హేతువుకు అందని, కుదరని కబుర్లు పోగేసి దేశంలోని బుద్ధగయకే కాక, పొరుగున నేపాల్‌లోని లుంబినికి తరలించడం ఏమేరకు ఆహ్వానించదగ్గది?... హర్షించదగ్గది? సిద్ధార్థుడు (బుద్ధుడు), అతని తల్లి మాయాదేవి దేవతాంశ.. వాళ్లు భగవత్ స్వరూపులు, అశేష-విశేష మహిమలు గలవారు, లౌకిక ప్రపంచంలో బతికే కోట్లాది ప్రజల ఈతిబాధలు కడతేరేందుకు ‘‘మార్గం’’ సూచించారని చెబితే అప్పుడు వారిని ప్రశ్నించేందుకు ఎవరూ ముందుకురారు. కాని బుద్ధుడు దేవుడినే ప్రశ్నించాడని, దేవుడు అన్న కానె్సప్ట్‌ను వ్యతిరేకించాడని, నైతిక జీవనంపై ఫోకస్ పెట్టి ప్రచారం చేశాడని, ఆయన పూర్తిగా భౌతికవాది అని, తొలి ‘సమతావాది’అని.. ఇట్లా అనేక విశేషణాలతో ఊదరగొట్టి, ఆఖరున సిద్ధార్థుని తల్లికి సైతం భవ్యమైన మందిరం నిర్మించి ఆ పవిత్ర స్థలాన్ని సైతం తప్పక సందర్శించాలని ప్రచారం చేయడం ఏ రకంగా భౌతికవాదమవుతుంది? నైతిక జీవనాన్ని ఏ రకంగా ఉన్నతీకరించినట్టవుతుంది? కాల్పనిక, ఊహాత్మక, అధిభౌతికాంశాల చుట్టూ పరిభ్రమిస్తే ఈ లౌకిక ప్రపంచంలో సమానత ఏర్పడుతుందా?... వర్తమాన స్ర్తివాదులు యశోధర వైపు నిలిచి సిద్ధార్థుడిని ప్రశ్నిస్తున్నారు.. ఆమె వగచడాన్ని సహానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.
ఇట్లా బహుముఖీన ఆలోచనలు, అభిప్రాయాలు పుష్పిస్తున్న తరుణంలో 30 సంవత్సరాలు యువరాజుగా వైభోగం అనుభవించి ‘వైరాగ్యం’తో రాజమహల్‌ను వదిలివెళ్ళిన సిద్ధార్థుడు అంతకుపూర్వం వేల సంవత్సరాలుగా ఉన్న ధ్యానమార్గంలో ప్రయాణించి లౌకిక ప్రపంచపు ఈతి బాధలకు, ఆత్మజ్ఞానం కాదుకదా ఏ రకమైన జ్ఞానంలేని కోట్లాది మంది ప్రజలకు ఉపకరించే, ఉపశమనం కలిగించే ‘దారి’చూపకుండా, ‘మార్గం’ సూచించకుండా, ఆత్మజ్ఞానంలోని అష్టసూత్రాలను జ్ఞాన సంపన్నులైన, అపూర్వధారణాశక్తిగల బ్రాహ్మణులతో కలిసి ‘‘సంఘం’’పెట్టి, కాషాయంతో భిక్షాపాత్రలతో తిరుగుతూ కోర్కెలను, ఆశలను అదుపులో పెట్టుకోవాలని బోధించడం, అపురూపమనుకోవడం అప్పుడైనా, ఇప్పుడైనా అర్థరహితం. ఇది పూర్తిగా వంచన తప్ప మరొకటి కాదు.

-వుప్పల నరసింహం 99857 81799