Others

నోటి దుర్వాసనకు దూరంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోటి దుర్వాసన పెద్ద సమస్య. ఈ సమస్య వల్ల ఎదుటివారు మనతో మాట్లాడాలంటే ఇబ్బంది పడతారు. కొన్నిసార్లు ఇది శరీరంలోని వివిధ రుగ్మతల వల్ల వస్తుంది. చాలామటుకు అనారోగ్యకరమైన అలవాట్ల వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. అయినప్పటికీ చిన్న చిన్న జాగ్రత్తలతో దీన్ని సులువుగా అరికట్టవచ్చు.
* ఉదయానే్న పళ్ళు తోముకునేటప్పుడు నాలుకను కూడా టంగ్ క్లీనర్‌తో శుభ్రపరచుకోవాలి. రోజంతా తినేటప్పుడు వివిధ రకాల ఆహారపదార్థాల రసాలు నాలుకపై ఉండిపోతాయి. రాత్రంతా నోరు మెదపక నిద్రపోతాం కాబట్టి ఈ రసాలన్నీ ఇనె్ఫక్ట్ అయి దుర్వాసన వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాక కడుపులో లోబైల్ రాత్రిపూట అన్నవాహిక గుండా నోట్లోకి వచ్చి అక్కడ పేరుకుపోతుంది. అందువల్ల ఉదయానే్న పళ్లు తోముకుంటున్నప్పుడు నాలుక శుభ్రపరచడం తప్పనిసరి.
* ఆపిల్ లేదా క్యారెట్‌లను రోజూ తినడం వల్ల పళ్ళపై ఒత్తిడి పెరిగి వాటిపై పేరుకుంటున్న మలినాలు తొలగిపోయి శ్వాస శుభ్రంగా, తాజాగా ఎటువంటి దుర్వాసన లేకుండా ఉంటుంది.
* మృదువుగా, క్రీములా ఉండే ఆహారపదార్థాలు పళ్లపై, నాలుకపై అంటుకుని బాక్టీరియాని పెంచి దుర్వాసనకు దారితీస్తుంది. కాబట్టి ఆహారపదార్థాలపై ఈ మెలకువలు పాటించాల్సిందే.
* కాఫీ కూడా దుర్వాసనకు మూలకారణమనేది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి కాఫీలను తాగడం మానేయాలి. అలాగే గ్రీన్ టీ ఓవరాల్ ఆరోగ్యానే్న కాదు, శ్వాసను కూడా గణనీయంగా మెరుగు పరుస్తుందని తేలింది. అందుకే కాఫీ, టీవంటి రొటీన్ అలవాట్లను మానేసి గ్రీన్ టీలను తాగడం అలవాటు చేసుకోవాలి.
* కొబ్బరి, కొబ్బరి నూనె వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ తెలిసినవే.. అయితే వీటిల్లో శ్వాసను మెరుగు పరచడం కూడా ఒకటి అన్నది చాలామంది తెలియని విషయం. కొద్దిపాటి కొబ్బరినూనెను నోట్లోకి తీసుకొని నాలుగైదుసార్లు పుక్కిలించడం వల్ల నోట్లోని హానికారక బాక్టీరియా పోతుంది. అంతేకాకుండా చిగుర్ల ఆరోగ్యం కూడా గణనీయంగా మెరుగుపడుతుంది.
* వారానికి ఒకసారి తప్పనిసరిగా లేత వేప పుల్లలతో పళ్లు తోమడం వల్ల చిగుళ్లు, దంతాలు, నాలుక శుభ్రపడి, నోట్లో ఏదైనా బాక్టీరియా ఉండేట్లయితే తొలగిపోతుంది.
* పళ్లు తోమినప్పుడు చేతివేళ్లతో చిగుళ్లపై నెమ్మదిగా రుద్దడం వల్ల బాక్టీరియా పోవడంతో పాటు రక్తప్రసరణ కూడా పెరుగుతుంది.
* ఎప్పుడైనా పళ్ల నుండి కానీ, దంతాల నుండి కానీ రక్తం కారుతుంటే తప్పనిసరిగా డాక్టరును సంప్రదించాలి.