Others

రాగమరుూ రావే (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు పాటకు ప్రత్యేక గౌరవం కలిగించి పట్ట్భాషేకం చేసిన ఉద్దంత సంగీత దర్శకుల్లో పెండ్యాలకు ప్రథమ తాంబూలం ఇవ్వాలి. సాహిత్యానికి, సంగీతానికి, గాత్రాన్ని సమపాళ్లలో రంగరించి సర్వోన్నత ప్రయోగాలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. అలాంటి ప్రయోగాల కోసమే జయభేరిలాంటి సినిమాలను ఆలంబనగా చేసుకున్నారని చెప్పడానికి ఎలాంటి సందేహాలూ అవసరం లేదు. ఈ చిత్రంలో ప్రత పాట ఓ ఆణిముత్యం. ఏ పాటనూ తక్కువ చేసి చెప్పలేం. కాకపోతే హాయిగా పాడుకోవడానికి వీలైన ‘రాగమరుూ రావే/ అనురాగమరుూ రావే/ నీలాల గగనాన నిండిన వెనె్నల/ నీ చిరునవ్వుల కలకలలాడగ’ పాట హాయిగా వుంటుంది. 1959లో విడుదలైన జయభేరి సినిమాలో ఘంటసాల గాత్ర విశ్వరూపం, పెండ్యాల స్వరనైపుణ్యం, మల్లాది జానుతెనుగు పదాల సోయగం, నటీనటుల హావభావాలు కలగలసి పాలు, చెరుకురసం, తేనె, పంచదార మిశ్రమంలా ఉండి చెవులకే కాదు పెదాలకూ తీయందనాన్ని అందిస్తుంది. అన్నీ కలగలసి ఈ చిత్రాన్ని జయభేరి మ్రోగించాయి. గాయనీ గాయకులు కవి, సంగీత దర్శకుల స్థాయిని అందుకుని అంతకన్నా ఎక్కువగా పాటను గానం చేశారు. ‘చివురులు మేసిన చిన్నారి కోయిల మరి మరి మురిసె మాధురి నీవే’ అన్న మొదటి చరణం రికార్డుల్లో వినపడదు. అయితే 1980లో విడుదలైనప్పుడు పూర్తి పాట వుంటుంది. చిన్నారి కోయిలలు, మరుమల్లెలు, విరజాజులు, నెలరాయుడు, కలువలు, జిలుగు, పరిమళం, పులకరింతలు, కలవరింతలు లాంటి పదాలు తేనెలో ముంచి నోటికందించినట్లు ఉంటాయి. అభేరి రాగంలో పాటను స్వరపరిచి రసిక జనుల హృదయాలను రసభరితం చేశారు పెండ్యాల. అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవిపై చిత్రీకరించిన ఈ పాట అద్భుతమైన గీతంగా ఇప్పటికీ సినిమాప్రియుల ఆదరణ పొందుతోంది.

-జీవీ రత్నరాజు, చిత్తూరు