Others

వీరకంకణం (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వీర కంకణం’ జానపద చిత్రాన్ని మోడరన్ థియేటర్స్ బ్యానర్ మీద నిర్మిస్తే, 1957లో విడుదలైంది. తమిళ జానపద చిత్రం ‘మంత్రి కుమారి’ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారని అంటారు. తెలుగు జానపద చిత్రాలకు ఓ కొత్త ఒరవడి అద్దిన సినిమా ఇది. అంతకు ముందువరకూ జానపద చిత్రాల్లో మాంత్రికులు, మంత్రతంత్రాలు, దేవకన్యలు తప్పనిసరిగా ఉండేవారు. ‘అల్లావుద్దీన్ అద్భుతదీపం’ వరకు ఇదే పరిస్థితి. కానీ, రాజరిక వ్యవస్థలో మతం పేరిట సాగే దోపిడీ, స్వార్థపరులైన అధికారులవల్ల సామాన్య జనం పడే అవస్థలు, దేశంకోసం ప్రాణాలర్పించే వీరులు, వీర వనితలు ముఖ్య కథాంశాలుగా అల్లుకుని తీసిన సినిమా ఇది. అందుకే ఇది నాకు బాగా నచ్చిన చిత్రం. వ్యక్తిగత ప్రయోజనాలకంటే దేశ క్షేమమే మిన్న అనేది ఈ చిత్రంలో అద్భుతంగా చూపించారు. దేశంకోసం ఏ త్యాగానికైనా సిద్ధపడే సేనాధిపతి వీరమోహన్ పాత్రలో ఎన్టీ రామారావు ఒదిగిపోయారు. రాకుమారిగా కృష్ణకుమారి, మంత్రి కుమార్తెగా జమున అద్భుతమైన పాత్రలను పోషించారు. ఇక అమాయక రాజును, ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టే రాజగురువుగా గుమ్మడి పాత్ర, స్వార్థపరుడు, నయవంచకుడైన అతని కొడుకు చంద్రసేనుడి పాత్రలో జగ్గయ్య ప్రదర్శించిన నటన మాటలకందనిది. ఈ చిత్రానికి ఆరుద్ర ఆణిముత్యాల్లాంటి సంభాషణలు సమకూర్చారు. కీలక సన్నివేశాల్లో ఆయన వ్రాసిన డైలాగులు అద్భుతంగా పేలాయి. ఈ చిత్రానికి సుసర్ల దక్షిణామూర్తి సమకూర్చిన సంగీతం చిత్రానికి కొండంత బలాన్ని సమకూర్చింది. ‘కట్టండి వీరకంకణం/ పట్టండి ధర్మఖడ్గమే/ దేశభక్తి చూపుటకై’ అనే బృందగానాన్ని ఎన్టీఆర్, జమునలపై చిత్రీకరించారు. ఎఎమ్ రాజా, జిక్కి బృందం పాడిన పాట ఆద్యంతం ఉద్వేగ భరితంగా ఉంటుంది. మతం, దేవుడి పేరిట జనాన్ని వంచించడం, అధికారాన్ని హస్తగతం చేసుకోవడం దేశ చరిత్రలో కొత్త విషయమేమీ కాదు. కానీ జనం చైతన్యవంతమైనపుడు ఏం జరుగుతుంది? అదేది ఈ చిత్రంలో గొప్ప క్లైమాక్స్. అన్ని అనర్థాలకు మూలం రాజగురువని గ్రహించిన జనం ఆగ్రహంతో అతన్ని ఊరి పొలిమేరల వరకు తరిమికొడతారు. జనాగ్రహానికి గురైన రాజగురువు మరణిస్తాడు. రాజ్యక్షేమం కోసం దుష్టుడైన భర్తను సైతం అంతమొందించడానికి వెనుకాడని వీరనారి మంత్రి కుమారి పాత్రకు జమున జీవం పోశారు. ఈ కథాంశం స్ఫూర్తితో తర్వాత మరికొన్ని జానపద చిత్రాలు వచ్చాయి. కానీ ‘వీరకంకణం’ చిత్రానికున్న వైవిధ్యం మరిదేనికీ లేదు.

-సాగర శ్రీనివాస్, అనకాపల్లి