Others

అభయ ప్రదాత ఆంజనేయస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోగము, మోక్షము రెండింటిని అను గ్రహింప చేసే స్వామి శ్రీ ఆంజనేయస్వామి. అత్యంత శక్తి సంపన్నుడు.రాముని భక్తుల్లో అత్యంత శ్రేష్టుఢు.
అట్టి దివ్య మహిమాన్వితుడైన శ్రీ ఆంజనేయస్వామి వారిని పూజించే సుదినమే చైత్రమాస పూర్ణిమ.పూర్ణిమ రోజున హను మంతుని పూజచేసి హనుమంతుని ఉత్సవాలు జరిపించడం అనాదిగా వస్తున్న ఆచారం. మంగళవారం, శనివారం ఆంజనేయునికి ప్రీతికరాలు. వైశాఖ బహుళ దశమి, పూర్వాభాద్ర నక్షత్రం వైధృతి యోగంలో ఆ స్వామి జన్మించినట్లు ‘‘పరాశర సంహిత’’చెబుతుంది.
ఎక్కడ రామనామం వినబడుతుంటుందో అక్కడ ఆనందభాష్పాలు కారుస్తూ చేతులు మోడ్చి నేటికీ రామనామధ్యానంలో మునిగి పోయ ఉంటాడు హనుమంతుడు.
శ్రీరామనామ మంత్రోచ్ఛారణ చేత అనంతకోటి ఫలాలు కలుగుతాయన్నది హనుమంతుని ప్రగాఢ విశ్వాసం. రామనామానికి మించిన దేదీలేదని హనుమంతుని ఉవాచ.
హనుమదుపాసన అత్యంత అత్యద్భుత దివ్య ఫలితాలను ప్రసాదిస్తుందని హనుమం తుని భక్తులు చెబుతుంటారు. స్మరణ మాత్ర సంతుష్టుడైన ఆ స్వామిని నమ్మి కొల్చిన వారికి కొంగు బంగారం. ఈ కలికాలంలో సంభవించే సర్వ కష్టనష్ట నివారణలకు ఆంజనేయుని ఆరాధన అత్యంత శ్రేష్టమైన ఫలితాలను ఇస్తుంది. నియమనిష్టలు కూడా హనుమదారాధనకు అత్యంత ముఖ్యమైనవి. వీరత్వ, శూరత్వ, బుద్ధిమత్వ, దక్షత్వాది సద్గుణాలకు నిధి. పరమనీతిజ్ఞుడు, పరాక్రమధీశాలి. శాస్త్ర పారంగత విద్వాంసుడు. సరళ స్వరూపుడు. జీవిత సర్వస్వాన్నీ రామాంకితమొనర్చినవాడు. హనుమన్న. ఆయన రోమ రోమం రామమయం. ధర్మమే ప్రాణస్వరూపంగా గల మన పుణ్యభూమిలో వీధి వీధిన చిన్నదో పెద్దదో హనుమంతుని ఆలయంగాని, మందిరం లేదా విగ్రహం గాని ఉండి తీరుతుంది. చివరకు వ్యాయామ కళాశాలలో కూడా హనుమ పటమో, మట్టితో చేసిన బొమ్మో పెట్టుకొని ఆయనకు పూజచేశాకే తమ సాధన ప్రారంభిస్తారు. శక్తినీ, భక్తినీ, సమర్పణనూ, నిష్కపట సేవనూ, త్యాగ బలిదాన భావాలను తన భక్తులను సదా హనుమ ప్రసాదిస్తూనే వుంటాడు. హనుమంతుడు ప్రసన్నుడవటానికి అంతగా సమయం పట్టదని, ‘‘ఓం శ్రీరామ జయరామ జయజయ రామ’ అంటూ నిష్కల్మష భక్తితో జపిస్తే చాలు ఆ రామభక్తుడు కరుణిస్తాడని, హనుమంతుని ఆరాధనవలన శీఘ్రంగా ఆధ్యాత్మిక ఫలాలు పొందవచ్చని శాస్త్రాలు, అనుభవజ్ఞులు చెబుతున్నారు.
భూత ప్రేత పిశాచాదులు ఆ మహావీరుని నామోచ్ఛారణ మాత్రం చేతనే పారిపోతాయి. మానసిక దౌర్భల్య సంఘర్షణలో ఆ స్వామి సహకారం నిశ్చయంగా లభిస్తుంది.
భగవతత్త్వ విజ్ఞానానికి, భక్తికి, మహోన్నత భావాలతో భగవదనురక్తి సేవలకు, వ్యక్తిత్వ పూర్ణ వికాసాలకు హనుమంతుని మించిన వారు లేరు. సనక, సనందన, సనత్కుమార, సనాతన సోదరులు నలుగురూ హనుమంతుని ద్వారా శ్రీరామ మంత్ర రహస్యాలను తెలుసుకునేవారట. ఆయన దగ్గరే అనేక ఋషివర్యులూ, మునిసత్తములూ, ప్రహ్లాదుడూ శిష్యరికం చేశారని పురాణ వచనం. హనుమంతునకు స్వయంగా శ్రీరాముడే ఉపనిషత్ తత్త్వాన్ని బోధించినట్లు కొన్ని పురాణాలు చెబు తున్నాయ. లౌకిక సమస్యలు ఎదురైనప్పుడు కూడా కార్యసాధనకై భక్తులు శ్రీరామ సమేతుడైన హనుమంతుని పూజించాలి. భక్తజనవ శంకరుడైన హనుమంతుడు తనను పూజించే వారి అభీష్టాలను నెరవేర్చేందుకు సదా సంసిద్ధుడై ఉంటాడు. తులసీదాసు రామాయణ పారాయణ చేస్తుంటే ఆంజనేయుడు వచ్చి కూర్చుని వినేవాడని జనశ్రుతి. ఆర్తితో పిలిస్తే ఆంజనేయుడు కనబడితీరుతాడు.

- చివుకుల రామ మోహన్