Others

ఎముక ఆరోగ్యానికి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిరోజూ మనం కూరగాయలు, పండ్లు ఎన్నో తీసుకుంటాం కదా.. వీటితో పాటు ఇంకొన్ని పదార్థాలను తరచూ తినేందుకు ప్రయత్నిస్తే ఎన్నో లాభాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఒకసారి చూద్దాం.
గుమ్మడి గింజలు
గుమ్మడి గింజల్లో మాంసకృత్తులు అధికంగా ఉంటాయి. శరీరానికి అవసరమైన జింక్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ వంటి ఖనిజాలన్నీ ఇందులో ఉంటాయి. శరీరానికి ఇతర విటమిన్లు కూడా అందుతాయి. అందువల్ల వీటిని తీసుకుంటే హృద్రోగాలకు దూరంగా ఉండచ్చు. సెరటోనిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి.
నువ్వులు
ఇందులో జింక్, కాల్షియం, ఫాస్పరస్‌లు ఎక్కువ. ఇవి ఎముక మజ్జను ఏర్పరచడంలో కూడా కీలకపాత్ర పోషిస్తాయి. ఎముక పుష్టినీ పెంచుతాయి. వీటిని తరచూ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటును, గుండె జబ్బుల్ని అదుపులో పెట్టుకోవచ్చు.
అవిసె గింజలు
అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ. ఇవి హార్మోన్ల అసమతుల్యతని తగ్గిస్తాయి. నెలసరి సమస్యలు అదుపులో ఉంటాయి. వీటిల్లో కావలసినంత పీచు ఉంటుంది. అవిసె గింజల నుంచి అందే మాంసకృత్తులు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు అవిసె గింజల్ని తీసుకోవడం వల్ల చర్మం కాంతిమంతంగా మారుతుంది. అలాగే బరువు కూడా సులువుగా తగ్గవచ్చు.
జీలకర్ర
జీలకర్రలో జీర్ణశక్తిని పెంచే గుణం ఉంటుంది. ఇది మధుమేహాన్ని, రక్తంలో కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా బరువు తగ్గడానికి తోడ్పడుతుంది జీలకర్ర.
మెంతులు
బాలింతలు మెంతులను తీసుకోవడం వల్ల వారిలో పాల ఉత్పత్తి పెరుగుతుంది. అందుకే గర్భిణిగా ఉన్నప్పటి నుంచే వీటిని ఆహారంలో చేర్చి పెడుతుంటారు. గాయాలు, అల్సర్లు, చుండ్రు, ఎగ్జిమా, సయాటికా వంటి సయస్యలకు మెంతులు చక్కటి పరిష్కారం. మధుమేహులు మెంతులు నానబెట్టిన నీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సమతూకంలో ఉంటాయి.
సోంపు ఇవి రుచికి తియ్యగా ఉండటంతో పాటు ఆహార అరుగుదలకు తోడ్పడతాయి.