Others

వినరా వినరా నరుడా (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1968లో అక్కినేని ద్విపాత్రాభినయ చిత్రం -గోవులగోపన్నలోనిది ఈ పాట. ఎన్నోవిధాలుగా మనిషికి సహాయం చేస్తున్న గోమాత గొప్పదనం గురించి ఓ పశువుల కాపరి చెప్పిన సత్యాలుగా ఈ పాట సాగించిన తీరు అద్భుతం, అభినందనీయం. కల్లాకపటం ఎరుగని గంగిగోవునని ఇంత గడ్డిపడేసినా యజమాని సేవకే అంకితమవుతున్నామని ప్రారంభించి, కమ్మనైన గుమ్మపాలు కడవలలో అందించడం, శుభకార్యాలకు ఎదురొచ్చి శుభాలు కలిగించడం, వృద్ధాప్యంలో మీకు సేవలు చేయలేనపుడు నన్ను వధించే కటికవానికి అప్పగించినా దాని ద్వారా కూడా కొంత మొత్తం అందించి మీకే ఉపయోగపడుతున్నానని చెప్పడం హృదయాలను బరువెక్కిస్తుంది. గోమాత సంతానమైన ఎడ్లు భూమి దున్ని పంట పండించి అందరికీ ఆహారం అందిస్తున్నామని, తాను విసర్జించిన పేడను ఎరువుగాను, వంట గ్యాసుగాను ఉపయోగపడుతోందని, తన చర్మం కాలికి చెప్పులుగాను, ఢంకాలకు నాదం అందించేదిగా అమరుతోందని చెబుతూ తన శరీరం ఎంతగా ప్రజల అవసరాలకు ఉపయోపడుతుందో చెప్పినతీరు బాధాకరం. నా కొమ్ములు మన తలలకు చిక్కు తీసే దువ్వెనలుగా, తన చితాభస్మం విభూధిగా నొసలును అలంకరించుతున్నానని గృహ ప్రవేశాలకు మనకంట ముందు గోవులనే పంపి శుభాలను కోరుకుంటున్నామని చివరికి మరణించిన తరువాత ఆత్మలు వైతరిణి దాటించేది కూడా గోదానమేనంటూ చెప్పిన తీరు ఆలోచనాత్మకం. కాని నేడు గోసంరక్షణను చాలామంది నిర్లక్ష్యంచేసి మిషనులో తయారైన విషతుల్యపు పాలు తాగుతూ (తల్లి పాలులేని చంటి పిల్లలకు ఆవుపాలే శ్రేష్టమని పడతారు) కనీసం వాటికి గడ్డి పెట్టడానికి అవసరమైన జాగాకూడా లేకుండా ఇళ్లు కట్టేస్తూ, గోసంపదను పెంచకపోగా కనీసం సంరక్షణకు కూడా ప్రయత్నించకపోవడంతో వాటి సంతతి తగ్గిపోయి పాల సంపద తగ్గిపోయి అనారోగ్యం పాలవుతున్నాము. ఘంటసాల స్వరసారధ్యంలో ఆయనే గానం ఈ గీతం వినడానికి మధురంగాను, ఆలోచింపచేసేదిగాను ఓ గోమాత వ్యధను మనముందు ఆవిష్కరించేదిగానూ నిలిచి నేటికీ ప్రేక్షక హృదయాలను ఆలోచింపచేస్తున్న గీతం.

-ఎస్‌ఎస్ శాస్ర్తీ, విశాఖపట్నం