AADIVAVRAM - Others

ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనకు మిత్రులు, శత్రువులు అంతటా ఉంటారు. మన శత్రువులతో, మనమంటే పడని వ్యక్తులతో ఘర్షణ పడి మన సమయాన్ని పాడు చేసుకోకుండా దూరంగా ఉండటం మంచి పద్ధతి. ఈ విషయం ఇలా చెబితే ఎవరూ అర్థం చేసుకోరు. శత్రువుల మీద, పడని వ్యక్తుల మీద కోపం ఎక్కువ పెంచుకొని వాళ్లతో ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారు.
ఈ విషయం గురించి గ్రీకు పురాణ గాథల్లో ఓ కథ ఉంది. ఆ కథ చదివితే మన శత్రువులతో, మనమంటే పడని వ్యక్తులతో ఎలా ఉండాలో అర్థం అవుతుంది.
హెర్క్యులస్ అన్న వ్యక్తి ఓ గొప్ప వీరుడు. శక్తిమంతుడు. శౌర్యం, పరాక్రమం బాగా కలిగిన వ్యక్తి. ఓ రోజు అతను ఓ అడవి గుండా నడుస్తూ వెళ్తున్నప్పుడు ఓ చిన్న మామిడి పండు ఆకారంలో వున్న వస్తువు తాకి చిన్నగా వొణికాడు. ఆ చిన్న వస్తువు తనని ఇబ్బంది పెట్టిందని అతనికి కోపం వచ్చింది. ఆ వస్తువుని నలిపివేయాలన్న ఉద్దేశంతో దాన్ని తన కాలుతో నలిపాడు. అది తన ఆకారాన్ని రెట్టింపు చేసుకొంది. అతను ఆశ్చర్యపోయి ముష్టిఘాతం ఇచ్చాడు. అది మళ్లీ రెండింతలు పెరిగింది. తన దగ్గర వున్న పెద్ద కట్టెతో దాన్ని అణచివేయడానికి ప్రయత్నం చేశాడు. దాన్ని అంతం చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ అది రెట్టింపు అవుతూ వచ్చింది. చివరికి అది ఓ పెద్ద పర్వతంలా మారింది. అతనికి అంతగా ఆటంకం కలిగించని వస్తువు అతను దాని వెంట పడటం వల్ల ఆటంకం కలిగే విధంగా పరిణమించింది. అతనికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు.
అంత లో అతను తరచూ పూజించే దేవత ప్రత్యక్షమై హెర్క్యులస్‌తో ఇలా చెప్పింది.
‘దాన్ని కొట్టడం మానెయ్ హెర్క్యులస్! దాన్ని కొట్టిన కొద్దీ అది రెట్టింపు అవుతుంది. అది జగడం. విరోధి లాంటిది. నువ్వు ఏమీ చేయకుండా వదిలేస్తే అది మామూలు రూపానికి వస్తుంది.’
విషయం హెర్క్యులస్‌కి అర్థమైంది. కొట్టడం మానేశాడు. కొద్దిసేపటికి అది మామూలు రూపానికి వచ్చేసింది.
మనకు పడని వ్యక్తులని పట్టించుకోకపోతే మంచిది. వాళ్లని పట్టించుకొని ఏమైనా చేద్దామంటే వాళ్లు కూడా హెర్క్యులస్ కథలోని వస్తువులాగా పెరిగిపోతూ ఉంటారు. మన మానసిక ప్రశాంతతకి భంగం కలిగిస్తూ ఉంటారు.
ఘర్షణకి దూరంగా ఉంటే మంచిది. ప్రశాంతత కోల్పోకుండా ఉంటాం.