Others

కలం - కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది అక్షరాలను
సృష్టించే గర్భస్థలం
అచటి నుంచి
ఎన్ని అస్త్రాలు
ఆయువు పోసుకుంటున్నాయో
కాలానికే తెలుసు

అది పదాల పొదరిళ్లను
నిర్మించే విశ్వకర్మ క్షేత్రం
అచట సమాజాన్ని కదిపే
ఎన్ని శిల్పాలు సృష్టించబడుతున్నాయో
కాలానికే తెలుసు

అది వాక్యాల వేకువకు
సూర్యోదయం
అచట ఎన్ని చీకట్లను చిదిమేసే
చిన్మయానంద లహరీ ప్రవాహాలు
పురుడు పోసుకుంటున్నాయో
కాలానికే తెలుసు.

- ఆదోని అభిరామ్