Others
ఆత్మగౌరవం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 8 April 2019
- విజయలక్ష్మీ నాగరాజ్, 9966559567

అలలు అలలుగా
అస్పష్టమే స్పష్టం అన్నంత స్పష్టంగా...
చుట్టూ అల్లుకున్న తెరల్లో...
నాది కాని నా ఉనికే నేనై..
నేను కాని నేనే అనంత విశ్వమై!
నిన్నటి నీడలే నీ ఉనికి అంటూ...
ఊపిరిని బంధించిన పంజరాలు
కనబడని సంకెళ్లతో కవాతులు!
ఊహలకు రెక్కలు తొడిగే ప్రయత్నంలో
పటపటమని తెగుతున్న
యుగయుగాల బంధనాలు
ఆసరాకే ఆసరా అయన
ఆత్మవిశ్వాసపు విపంచులు
వినీలాకాశమే విస్తుపోయే ఉరవడితో!
మనుగడే మేము అన్న దురహంకారాన్ని
తుత్తునియలు చేస్తూ...
నీ అస్తిత్వమే నాలో అన్న
ధిక్కార స్వరమే నాదై!
అహంకారమని నీవు తలచినా...
తలవంచని ఆత్మగౌరవమే మాది!