Others

రాముడు - భీముడు (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్‌టిఆర్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన సినిమా. గిన్నీస్ రికార్డుకెక్కిన నిర్మాత రామానాయుడు సొంతంగా సురేష్ ప్రొడక్షన్స్ బేనరుపై తొలి చిత్రంగా 1962లో నిర్మించిన సినిమా. అమాయకుడైన రాముడు అక్క సంరక్షణలో పెరుగుతూ ఆస్తి కాజేయాలనుకున్న బావ పెడుతున్న చిత్రహింసలు భరిస్తూ ఒకరోజు ఆత్మహత్య చేసుకోబోగా అక్క తనమీద, కొడుకుమీద ఒట్టువేయించుకోడంతో ఆ ప్రయత్నం మానుకున్నా బాధలు తట్టుకోలేక ఇంట్లోనుండి పారిపోయి ఓ పల్లెటూరు చేరతాడు. నాటకాలలో వేషాలు వేసి బహుమతులు సాధించి సినిమాలపై మోజుతో ఇంట్లోంచి పారిపోయి పట్టణం చేరిన భీముడు అనుకోకుండా ఒక దొంగను పట్టుకుని గతంలో రాముడిని పెళ్ళిచూపులలో చూసిన జమున ఇంటికి చేరడం, అక్కడనుండి బావ ఇంటికి వెళ్ళి అక్క పడుతున్న కష్టాలు చూసి తన భుజబలంతో బావను దారిలోకి పెట్టి మిత్రుడు రేలంగి సహాయంతో ఫ్యాక్టరీ పాలన చక్కదిద్ది కార్మికుల జీవితాలను సరిదిద్దుతాడు భీముడు. పల్లెటూరు చేరిన రాముడు ఆ ఊరి ప్రజలద్వారా రాముడి తల్లిదగ్గరకు చేరి ఆమె లాలనలో మంచి ఆలోచనాపరుడిగా మారి వారికి నాయకుడిగా ఒక ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొని తనతో పనిచేస్తున్న యువతిని ప్రేమించి ఆమె బామ్మకు ముద్దుల మనవడిగా మారతాడు. ఇక్కడ బావ భీముడు అసలు వ్యక్తికాదని తెలుసుకుని అతడిని చంపే ప్రయత్నంచేయడం, అక్కడ రైతుల తరఫున రాముడు తన బావదగ్గరకు రావడంతో ఇద్దరిపై దౌర్జన్యం చేసిన రౌడీలు, బావ పని ఇద్దరూ కలిసి బుద్ధిచెప్పడం, తామిద్దరం చిన్నప్పుడే విడిపోయిన కవల సోదరులం అని అక్క, బామ్మ ద్వారా తెలియడంతో ఇద్దరూ తమకు నచ్చిన యువతులను వివాహం చేసుకుంటారు. పెండ్యాల సంగీతం ఈ చిత్రానికి పెద్ద ఎసెట్‌గా నిలిచింది. ఘంటసాల, సుశీల, మాధవపెద్ది పాడిన ‘‘ఉందిలే మంచికాలం’’, ‘తెలిసిందిలే’’, ‘‘అదే అదే నేను తెలుసుకున్నది’’, ‘‘దేశమ్ము మారిందోయ్, ‘‘హాయ్ తళుకు’’, ‘‘తగునా ఇది మామ’’వంటి పాటలు పెద్ద హిట్‌గా నిలిచి నేటికీ రంజింపచేస్తున్నాయి. ఎన్.టి.ఆర్, రేలంగి, రాజనాల, రమణారెడ్డి, జమున, ఎల్.విజయలక్ష్మి, ఎస్.వి.రంగారావు, హేమలత, శాంతకుమారి అద్వితీయ నటనతో తెలుగు ప్రేక్షకులనే కాదు వివిధ భాషల్లో ఈ చిత్రం నిర్మించబడి ఘన విజయంతో ఆదరించబడింది.
- సుసర్ల సర్వేశ్వరశాస్ర్తీ, విశాఖపట్నం