Others

కలల అలలపై.. (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి తారకరామారావు సొంత నిర్మాణ సంస్థలో నిర్మించిన చిత్రం ‘గులేబకావళి కథ’. 1962లో విడుదలైన ఈ చిత్రానికి సంగీతం జోసెఫ్, కృష్ణమూర్తి ద్వయం కాగా, దర్శకుడు కమలాకర కామేశ్వరరావు. ఇందులోని ‘కలల అలలపై’ అన్న యుగళ గీతం నాకు చాలా యిష్టం.
కలల అలలపై తేలెను మనసు మల్లెపూవు -ఎగసి పోదునో చెలియా.. నీవే ఇక నేనై.. అంటూ ఈ పాటను సి నారాయణరెడ్డి ప్రశ్న, జవాబు పద్ధతిలో రాయడం కొత్తగానూ, వింతగానూ, ఎంతో ఆహ్లాదకరంగానూ వుంటుంది. ‘జలకమాడు జవరాలిని చిలిపిగ చూచేవెందుకు’ అని ఆమె అడిగితే, ‘తడిసీ తడియని కొంగున ఒడలుదాచుకున్నందుకు’ అంటూ జవాబిస్తాడు కథానాయకుడు. మళ్లీ ఆమె ‘చూపుతోనే హృదయము ఝుమ్మనిపించేవెందుకు’ అంటే ‘విరిసీ విరియని పరువము -మరులుగొలుపుతున్నందుకు’ అని బదులిస్తాడు. సున్నితమైన శృంగారాన్ని ఈ చరణాల ద్వారా గ్రహించి వింత ఆనందాన్ని పొందడం ప్రేక్షకుడి వంతు అవుతుంది. ఈ ఆనందానే్న సినారె మాటల్లో చెప్పాలంటే బులబాటం అని కూడా అనొచ్చు.
ఇక రెండో చరణంలో రచయత సినారె మరింత బులబాటం అందించారు. అదెలా అంటే ‘సడి సవ్వడి వినిపించని నడి రాతిరి ఏమన్నది’ అన్న ప్రశ్నకు ‘జవరాలిని -చెలికాడిని జంటగూడి రమ్మన్నది’ అంటారు. ‘విరజాజులు పరిమళించు విరుల పానుపేమన్నది’ అని మరో ప్రశ్న సంధించి ‘అగుపించని ఆనందము బిగికౌగిట కలదన్నది’ అంటూ సమాధానమిచ్చారు. ఈ పాటకు గాత్రం అందించిన ఘంటసాల, జానకిల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది? ఎందుకంటే తెలుగువారికోసం సృష్టించబడ్డ గంధర్వ గాయకులు వాళ్లు. ఇంత బాగా ఇన్ని రకాలుగా హాయినిచ్చిన పాట ఇది. కాకపోతే ఇదే చిత్రంలో మరో యుగళం ‘నన్ను దోచుకుందువటే’ (సాహిత్యపరంగా తేలికైనది) అన్న పాటవల్ల ఈ పాట కొంత మరుగున పడింది. అదివరకు రుూ పాట (కలల అలలపై) విననివారు ఇప్పుడైనా విని ఆనందించండి.
-డొక్కా తాండవప్రియుడు, వక్కలంక