Others

చూరు పట్టుకు వేలాడుతున్న మాజీలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మామూలుగా ఎం.పీలు కూడా వాళ్లకిచ్చిన వసతి బంగ్లాలను- ‘రెంట్ పే’ దశ దాకా ఖాళీ చేయరు. కానీ, ముఖ్యమంత్రులు అంటే బడా ఆసాములు కదా? మాజీలు కాంగానే వాళ్ల ఆలీషాన్ పాత బంగ్లాలను ఖాళీ చేయాలిగా? ఉహూ.. వాళ్లూ ఆ గోతిలో మట్టేగా.. ఘనత వహించిన ఉత్తరప్రదేశ్‌లోని ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు- వాళ్ల పేర్లు చెబితే చాలు- ఎంతటి హేమాహెమీలో తెలుస్తుంది. వాళ్ల పేర్లు యివి-
సర్వశ్రీ కళ్యాణ్‌సింగ్, రాజ్‌నాథ్‌సింగ్, ములాయంసింగ్ యాదవ్, మాయావతీ బెహ్‌జీ, నారాయణ్ దత్ తివారీ అండ్ రామ్‌నరేశ్ యాదవ్. వీళ్లంతా పదవీచ్యుతులైన ముఖ్యమంత్రులు. వీళ్లకి హోదాలో వుండగా అతి విలాసవంతమయిన ‘‘లక్నో మాల్ రోడ్’’లోనూ, ‘‘విక్రమాదిత్య మార్గ్’’లోనూ నివాస గృహాలు యిచ్చారు. వాటిని మాజీలు కాంగానే తిరిగి ఇవ్వాలిగా? గానీ ఒక్కరైనా ఆ వూసు ఎత్తడం లేదు. పిటీ!దీనిమీద లోక్‌ప్రహరీ అనే ఎం.జి.ఓ సంస్థ నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టి ఫిర్యాదు చేసింది. సుప్రీంకోర్టు ధర్మాసనం రుూ కేసుని విచారించింది. పదవులు వూడిపోయినవాళ్లు- ఆఖరికి ముఖ్యమంత్రులయినా సరే- సర్కారీ బంగ్లాలో వుండరాదు. ఖాళీ చేసెయ్యాలి’’ అంటూ తీర్పునిచ్చింది సుత్తికొట్టి మరీ..
‘‘ఇది చట్ట వ్యతిరేకం. రెండు మాసాలలో పెట్టే బేడా సర్దుకుని పోవాల్సిందే!’’నంటూ సీరియస్‌గా నోటీసు కూడా యిచ్చింది. ‘కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువే!’నన్న సామెత గుర్తుకురావటం లేదా?