Others

కవిసంధ్య, జైనీ ఇంటర్నేషనల్ కవితల పోటీ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా కవిసంధ్య, జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహించిన కవితల పోటీలో మొదటి బహుమతి బి.శివప్రసాద్ కవిత ‘స్మృతుల ఊరేగింపు’, రెండవ బహుమతి సీ.ఎస్.రాంబాబు కవిత ‘చీకటి చిరునవ్వు’, మూడవ బహుమతి సమ్మెట విజయ కవిత ‘ఆసరా’ ఎంపికయ్యాయ. రచయతలకు బహుమతి కింద వరుసగా రూ.3000, రూ.2000, రూ.1000లను మార్చి 21న యానాంలో జరిగే అంతర్జాతీయ కవితా దినోత్సవ సభలో అందించనున్నట్లు కవితల పోటీ కన్వీనర్ దాట్ల దేవదానంరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రోత్సాహక బహుమతులకు ఎంపికైన కవితలు - ఇటు కారుణ్యం (పీవీ రమణకుమార్), బాడీ షేమింగ్ (రాంభక్త పద్మావతి), మళ్లీ మొదలైన సలుపు (వైహెచ్‌కే మోహనరావు), ఉప్పుకసిం (మోకా రత్నరాజు), వృదాధ్రశమం (మాధారపు వాణిశ్రీ), అమ్మలేని సముద్రం (పీ.సీతారామరాజు), రాయలసీమ పల్లెనిద్ర (ఐ. మోహనరెడ్డి), ఒక్కమాట (పుచ్చా కుమారస్వామి), బతుకు జట్కాబండి (చొక్కాపు లక్ష్మునాయుడు), బాలోత్సవం (ఉప్పలపు జితేంద్ర శేషునాథ్) ఎంపికయ్యాయ. కవితల పోటీకి న్యాయ నిర్ణేతలుగా ఆశారాజు, ప్రసాదమూర్తి వ్యవహరించారు.
కవితా సంపుటాలకు ఆహ్వానం
ప్రతి ఏటా పెన్నా రచయతల సంఘం ఇచ్చే సాహితీ అవార్డు నిమిత్తం 2018 జనవరి నుండి 2018 డిసెంబర్ వరకు ప్రచురితమైన కవితా సంపుటాలను ఆహ్వానిస్తోంది. 2019 సంవత్సరానికి ఇచ్చే ఈ అవార్డుకు నగదు పురస్కారం కూడా ఉంది. కవితా సంపుటాలను మార్చి 31వ తేదీలోగా అవ్వారు శ్రీధర్‌బాబు, 23-1-57, పెండెంవారి వీధి, ఫత్తేఖాన్ పేట, నెల్లూరు - 524 003 చిరునామాకు పంపించాలి. వివరాలకు 8500130770 ఫోన్ నెంబర్‌లో సంప్రదించవచ్చు.