Others

23న సుద్దాల, దేవీప్రియలకు మువ్వా పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రగతిశీల సాహితీ ప్రయాణికుడు, కవి మువ్వా శ్రీనివాసరావు తల్లిదండ్రుల పేర ప్రతి ఏటా ఇస్తున్న మువ్వా పద్మావతి రంగయ్య సాహితీ పురస్కారానికి 2017 సంవత్సరానికి ప్రముఖ సినీ గేయ రచయత సుద్దాల అశోక్‌తేజ, 2018 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి దేవీప్రియ ఎంపికయ్యారు. ఖమ్మంలో ఈ నెల 23న భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగే సాహితీ సభలో ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నట్టు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సభలో మరో తొమ్మిదిమంది నవతరం కవులు అనిల్ డ్యాని, ఇబ్రహీం నిర్గుణ్, శ్రీనివాస్ సూఫీ, వర్మ కలిదిండి, శ్రీరాం పుప్పాల, కార్తీక్ నాయక్, మారోజు పెద్దన్న, సుభాషిణి తోట, స్వేచ్ఛలను కూడా సత్కరించనున్నారు. అనంతరం మువ్వా శ్రీనివాసరావు మూడవ కవితా సంపుటి ‘వాక్యాంతం’ ఆవిష్కరించనున్నారు.