Others

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకచోటు విడిచి మఱియొకచోట త్రవ్వనారంభించుటకు బదులు తాను బడిన శ్రమలో సగబాలైనను ఓపికతో మొదటి నూతికే వినియోగించిన పక్షమున వానికి నీరు లభించియుండెడిది. ఈ మతముకాదని ఆ మతము, ఆ మతముకాదని మఱియొక మతము- ఈ విధముగా మతధర్మములను ఊరక మార్చుకొనుచుండువారి విషయముకూడ నిట్టిదే. ఏదైన ఒక మతమును నమ్ముకొని దానినే శ్రద్ధ్భాక్తులతో సాధనచేసిన యెడల తప్పక విజయము చేకూరును.
530. పతివ్రతయగు స్ర్తిజన్మజన్మాంతరములయందు సైతము భర్తతో ఎడబాటు లేకుండును. అటులనే ఇష్టదైవమునెడ శ్రద్ధ్భాక్తులు గలవాడు నిశ్చయముగా భగవానునితో ఐక్యము పొందును.
సత్యము
531. కాపట్యమును వంచనను విడిచి యంతరంగమున భక్తి కలిగియుండుము. వర్తకముగాని, ఇతరమైన ఉద్యోగముగాని చేయువారు కూడ సత్యమును పరిపాలింపవలయును. సత్యము ఈ కలియుగమునకు విధింపబడిన తపస్సు.
532. సదా సత్యసంధులై యుండిననేకాని యెవ్వరును సత్యమూర్తియగు భగవంతుని గనజాలరు.
533. పూనికతో సదా సత్యమునే పలుకవలయును. సత్యసంధత మూలమున భగవంతుని గాంచనగును.
534. కృత్రిమ మెప్పుడును చెడుగే. కృత్రిమ వేషము సైతము చెడ్డదియే. మనస్సు నీ వేషమునకు అనుగుణముగా నుండనియెడల మహాపదల పాలగుదువు. ఘోర వినాశము పాలగుదువు. ఈ రీతిగనే నరుడు మోసగాడై తప్పు పనులుచేయుటకు గాని, అసత్యమాడుటకు గాని జంకకుండును.
535. ఒకడు చాల ఋణములు చేసి తన బాధ్యతను తప్పించుకొను నిమిత్తము పిచ్చియెత్తినటుల నటింపసాగెను.
వైద్యులు వానికి రోగ నివారణ చేయజాలరైరి; ఔషధములు ఇచ్చిన కొలదియు వాని పిచ్చి హెచ్చగుచుండెను. తుదకొక బుద్ధిశాలియగు వైద్యుడు నిజము కనుగొనవానిని చాటునకు దీసికొనిపోయి యిట్లు మందలించెను. ‘‘అయ్యో! ఇటుల చేయుట తగునా? పిచ్చియెత్తినటుల నటించుటచే నిజముగా పిచ్చివాడనే కాగలవుసుమీ! ఇప్పటికే నీయందు కొన్ని ఉన్మాద చిహ్నములు నాకు గాన్పించుచున్నవి.’’ ఈ హెచ్చరిక వానిని మేల్కొల్పెను. వాని దోషము వానికి గోచరించెను. అంతనాతడు పిచ్చివానివలె నటించుట మానివేసెను. మానవుడు సదా ఎట్లు నటించునో నిజముగా అట్టివాడేయగును.
బ్రహ్మచర్యము
536. అస్ఖలిత బ్రహ్మచర్యమూలమున తన శక్తిసామర్థ్యములను పవిత్రతను కాపాడుకొనువాని నిర్మల హృదయమున పరమేశ్వరుని దివ్యమంగళ స్వరూపము అద్దమున ముఖము ప్రతిబింబించునటుల ప్రతిబింబించును. (చూ.221, 650.)
537. అఖండ బ్రహ్మచర్య మవలంబించిననే కాని ఆధ్యాత్మిక రహస్యముల నెవ్వరును గ్రహింపజాలరు.
538. శుకదేవుడు ఊర్ధ్వరేతస్కుడు- ఆతడెన్నడును వీర్యస్ఖలనము పొందలేదు. ధైర్యరేతస్కులను నింకొక తరగతివారు కలరు. వీరిదివఱకు వీర్యస్ఖలనము నొందినను ఇప్పుడు అస్ఖలిత బ్రహ్మచర్యమును బరిపాలించుచున్నారు. పండ్రెండేండ్లు ఎవ్వడైనను ధైర్యరేతస్కుడై యుండునేని అమానుష శక్తినిబొందును. వానియందొక క్రొత్తనాడి బయలుదేఱును. అదియే మేధానాడి. తన్మూలముననాతడు సమస్తము జ్ఞప్తికి దెచ్చుకొనగల్గును, సమస్తము గ్రహింపగల్గును.
539. పండ్రెండేండ్లు ఎవ్వడైనను బ్రహ్మచర్యమును బరిపాలించునేని వానియందు మేధానాడి వికసించును. (అనగా వాని శక్తిసామర్థ్యములును గ్రహణశక్తియు వికాసమునొందును.) అత్యంత సూక్ష్మ విషయములను సైతము అవలీలగా గ్రహించునంతటి శక్తిసంపన్నుడగును.
- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి