Others
మహిళ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 11 March 2019
సముద్రాల శ్రీదేవి ఫోన్: 9949837743
ఆర్థినీ, ఆలంబననూ
అమ్మలో ఆవిష్కరిస్తూ
ఒద్దికనూ, ఓదార్పునూ
ఆలిలో అనుగ్రహిస్తూ
‘మహిని..’ తనలో నింపుకుంది మహిళ మహిమాన్వితులాయ్యింది సబల.
అవని గర్భాన్ని చీల్చుకొని
అంతరిక్షాన్ని ఛేదించుకొని
సంకల్పాన్ని సాధించింది,
సత్యాన్ని శోధించింది
నిన్నటి రాతల్ని మార్చే పథంలో
నేటి పోకడలను వెలివేసే కథనంలో
సజీవ భావమై నిలిచింది
సంస్కార రూపమై గెలిచింది
బంధాల, బాధ్యతలను తెలిపి
బ్రతుకు మలుపులని చవిచూసి
చరిత్రలో చెక్కిన శిల్పమై
ధరిత్రిలో చెరగని కల్పమై
తరాల అంతరాలు స్పృశించింది
సమయాన సమరాన్ని చాటింది
ధీర వనితగా, శాంతి చిత్తంగా మురిపించింది
మొల్లగా, వల్లిగా జల్లులు కురిపించింది
ఆమె ఒక స్ఫూర్తి
కమనీయపు కావ్యచిత్రం
ఆమె ఒక మూర్తి
కదలని కాలానికి చైత్రం